Flight Services : విజయవాడ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసులు.. టికెట్లు ప్రారంభం

విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీస్‌లు నడిపేందుకు విమానయాన సంస్ధలు రెడీ అవుతున్నాయి.

Flight Services From Vijayawada To Muscat (1)

Flight Services From Vijayawada to Muscat :  విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీస్‌లు నడిపేందుకు విమానయాన సంస్ధలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి ఒమాన్‌ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లను ఎయిర్‌ఇండియా ప్రారంభించనుంది.

ఎయిర్‌బస్‌ A–321 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్‌ దేశ కాలమానం ప్రకారం మస్కట్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్‌ఇండియా వర్గాలు తెలిపాయి. వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్‌కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్‌ ప్రకటించగా మరోవైపు టికిట్స్ బుకింగ్స్ సైతం ప్రారంభమయ్యాయి.