ఓడిపోతే “ఓట్ల చోరీ” అంటున్నారు.. గెలిచినప్పుడు ఓ న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా?: పవన్ కల్యాణ్

"ఏపీలో 2019లో వాళ్లు గెలిచినప్పుడు మేము ఎక్కడా ఆ మాట అనలేదు. ప్రజలు తీర్పుఇచ్చారు దాన్ని గౌరవించాం"అని అన్నారు.

ఓడిపోతే “ఓట్ల చోరీ” అంటున్నారు.. గెలిచినప్పుడు ఓ న్యాయం.. ఓడినప్పుడు మరో న్యాయమా?: పవన్ కల్యాణ్

Updated On : August 15, 2025 / 2:49 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, హామీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీలోని కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో పవన్ పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించాక మాట్లాడారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు బ్రిటిష్‌ పాలనలా పరిస్థితులు మారాయని అన్నారు. తాము స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.

దేశ విభజన జరిగిన తర్వాత మనం మతంతో సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి, లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. “మతాలకు సంబంధం లేకుండా అబ్దుల్ కలాం వంటి ఎవ్వరినైనా సరే మనం ప్రెసిడెంట్స్ గా తీసుకున్నాం.. గుండెల్లోకి పెట్టుకున్నాం.

కానీ, ఇటువంటి మంచి పాకిస్థాన్‌లో లేదు. పాకిస్థాన్‌ విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన.. కానీ, దాన్ని మనం ఎప్పుడూ అలా తీసుకోలేదు. మత ప్రాతిపాదికన రెండు దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశంలో అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించాం.

Also Read: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

ఇటువంటి సంస్కృతి ఎవరూ నేర్పించక్కర్లేదు.. పరాయివాళ్లు నేర్పించక్కర్లేదు.. యూరోపియన్స్ నేర్పించక్కర్లేదు.. ఇది మన లోపల ఉంది. ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే పెట్టుబడులు రావు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో 15 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించారు.

అంతకుముందు పెట్టుబడి రావడానికి ఎవరూ సాహసించేవారు కాదు.. కానీ.. యోగి రాగానే యూపీకి ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకులు ఓడిపోతేనేమో సడన్ గా ఓట్ చోరీ అంటారు. వాళ్లు గెలిచినప్పుడేమో ఓటు చోరీలు కనిపించవు వాళ్లకి.

గత ప్రభుత్వంలో కూడా చూశాం. 2019లో వాళ్లు గెలిచినప్పుడు మేము ఎక్కడా ఆ మాట అనలేదు. ప్రజలు తీర్పుఇచ్చారు దాన్ని గౌరవించాం. 2024లో కటమికి భారీ మెజార్టీ వస్తే ఓటింగ్ మిషన్ లో తప్పు ఉందని అన్నారు. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం.. ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయమా?” అని పవన్ నిలదీశారు.