లాక్ డౌన్ పాటించండి..రాకపోకలు వద్దు ప్లీజ్ అంటున్నారు పాలకులు. కానీ ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా రోడ్ల మీదకొస్తున్నారు. ఆ..ఏం అవుతుంది లే..అంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మోగుతున్న మరణ మృందంగం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని అంటున్నారు.
ఏ ప్రాంతం వాళ్లు..ఆ ప్రాంతంలోనే ఉండడం బెటర్ అని, సామాజిక దూరం పాటించాలని, ఇలా చేయడం వల్లే కరోనా మహమ్మారి అరికట్టవచ్చని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తేల్చిచెప్పింది.
ఈ వైరస్ ప్రథమంగా వచ్చిన వుహాన్ లో ఈ విధంగా పాటించడం వల్లే…ఆ ప్రాంతాలు సేఫ్ జోన్ లో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా భారతదేశంలో ప్రవేశించడంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు..జాతీయ విపత్తు నిర్వాహణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 2020, మార్చి 22వ తేదీనే దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ మరసటి రోజే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తునన్నట్లు, 21 రోజుల పాటు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతించాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నాయి. జనాల రాకపోకలను నియంత్రించాలని అటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎక్కడి వారెక్కడే ఉండాలని సూచించాయి.
* పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని నేరుగా అనుమతించకుండా..హెల్త్ ప్రోటోకాల్ మేరకు మాత్రమే అనుమతినిస్తున్నారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిన రాష్ట్ర ప్రజలు సొంతూళ్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
* కానీ వారి ఆరో్గ్యం ఎలా ఉందో ఎవరికీ తెలియదు…వారికి వైద్య పరీక్షలు నిర్వహించకుండా..క్వారంటైన్ లో ఉంచకుండా..గ్రామాల్లోకి పంపితే..వారి కుటుంబసభ్యులకే కాకుండా..రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
* ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ.. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచుతున్నారు.
* నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.
* వైరస్ సోకిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు.
* 14 రోజుల వైద్య పరిశీలన తర్వాత సొంతూళ్లకు వెళ్లడానికి అనుమతినిస్తున్నారు.
* లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయకపోతే..భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.