Former CBI JD Lakshminarayana: వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అంటే..

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేస్తానని స్పష్టంచేవారు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ..ఏ పార్టీ నుంచి అంటే..

Former CBI JD Lakshminarayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. పలువురిని కలిశారు. కానీ ఆయన ప్రస్తుతం ఏపార్టీకి సంబంధలేనట్లుగానే ఉంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ ఇప్పుడే ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈక్రమంలో లక్ష్మీనారాయణ అసలు రాజకీయాల్లో ఉన్నరా? ఉంటే ఏ పార్టీనుంచి? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే పలు అనుమానాలుకొసాగుతున్నవేళ ఆయన క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్త తెలియగానే ఏపార్టీ నుంచి అనే ఆసక్తి ఉంటుంది. కానీ ఆయనమాత్రం నా భావాలను అనుగుణంగా ఉండే పార్టీవైపే ఉంటానని కానీ స్వతంత్రంగా పోటీ చేసే అవకావం ఉంటుంది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల వైసీపీ నేత సజ్జల ఏపీ తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోతే బాగుంటుందని..విభజనకు వైసీపీ వ్యతిరేకించింది అంటూ కొత్త రాగం అందుకోవటంపై మీడియా అడిగిన ప్రశ్నకు లక్ష్మీనారాయణ సమాధానం ఇస్తూ..ఏపీ తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోతే బాగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

కానీ రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో నడుస్తోందని ప్రస్తుతం ఆ విషయం గురించి మాట్లాడకపోవటమే మంచిదన్నారు. అన్ని పార్టీలు కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలు రావు అంటూ సూచించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని.. తెలిపారు.

లక్ష్మీనారాయణ పూర్తి పేరు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ.OMC కుంభకోణం , ఎమ్మార్ ప్రాపర్టీస్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసు అవినీతి ఆస్తుల కేసు, సత్యం కుంభకోణం వంటి పలు కీలక కేసుల్లో దర్యాప్తులకు నాయకత్వం వహించిన వ్యక్తిగా ఫేమస్ అయిన ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్ (JD) అదే ఇంటిపేరుగా మారిపోయింది.వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ అంటే పెద్దగా అందరికి తెలియకపోవచ్చు కానీ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం అందరికి క్లియర్ గా తెలిసిపోయేంతగా ఆయన పేరు మారింది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయాక 2020లో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.