YS Jagan
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ ధర్మాసనంలో ఊరట లభించింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ తీర్పు ఇచ్చింది. సరస్వతి షేర్ల బదిలీ అక్రమమేనని.. ట్రాన్‌ఫర్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సర్వసతీ పవర్స్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ లో జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రిజిస్టర్ లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలంటూ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై పది నెలల పాటు విచారణ జరిగింది.
ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పురీ విచారణ జరిపారు. ఈక్రమంలో జగన్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ ఇవాళ తీర్పు వెల్లడించింది.