తిరుమల శ్రీవారి దర్శనాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక కామెంట్స్.. వాళ్లు ఏడాదిలో ఒకేసారి రావాలి..
తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
- Harishth Thanniru
- Updated on- July 28, 2025 / 11:21 AM IST
Former Vice President Venkaiah Naidu
Venkaiah Naidu: తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, వీఐపీల శ్రీవారి దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో హిందువులకు స్ఫూర్తి కేంద్రం తిరుమల. భక్తులు సమర్పించే కానుకలను ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వం రాజకీయ జోక్యం చేసుకోకుండా ఉండాలి. ప్రతి ఊరిలో గుడి కట్టడానికి టీటీడీ ముందుకు రావాలని కోరారు. గుడి, బడి లేని ఊరు ఉండకూడదు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం.. గుడి కట్టించడం దేవస్థానాల ప్రధాన కర్తవ్యం కావాలని సూచించారు.
దేవస్థానం నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇతరత్రాలకు ఖర్చు పెట్టకూడదు. కేవలం దేవాలయం అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మాత్రమే వినియోగించాలి. ప్రజాప్రతినిధులు, వీఐపీలు ఏడాదిలో ఒకేసారి దర్శనానికి రావాలి. వీఐపీలు తమవారిని పరిమితంగా దర్శనానికి తీసుకురావాలి. అలాచేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
