Leopard Trapped In Tirumala
Leopard Trapped In Tirumala: తిరుమల నడకదారిలో టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ ముగిసింది. ఎట్టకేలకు బోనులో నాలుగో చిరుత చిక్కింది. తిరుమల కాలినడక మార్గంలో వారం రోజులుగా చిరుతను ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాలినడక మార్గంలో పలు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. అయితే, కొద్దిరోజులుగా చిరుత పులి బోను వద్దకు వచ్చినట్లేవచ్చి వెనుదిరిగిపోతుంది. దీంతో చిరుతను పట్టుకొనేందుకు అటవీశాఖ అధికారులు పలు విధాల ప్రయత్నాలు చేశారు. చివరికి అటవీశాఖ అధికారుల ప్రయత్నం సఫలమైంది. ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జాము సమయంలో తిరుపతి కాలినడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు చిరుతలను అధికారులు బంధించారు.
Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..
తిరుమల నడక మార్గంలో చిరుత పులి చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్ అయింది. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు టీటీడీ భద్రతను కట్టుదిట్టం చేసింది. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. ఈనెల 11న లక్షితపై చిరుతదాడి చేసి హతమార్చగా.. అలర్ట్ అయిన టీటీడీ, అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈనెల 14న, 17వ తేదీన రెండు చిరుతలు బోనులో చిక్కాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది.
Leopard: బాబోయ్ మరో చిరుత..! తిరుమల కాలినడక మార్గంలో ఇంకో చిరుతపులి.. ఎలుగుబంటిసైతం ప్రత్యక్షం..
లక్షిత ఘటన తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేసి రెండు చిరుతలను బంధించారు. అయితే, వన్య ప్రాణుల సంచారంకోసం శేషాచలం అటవీ ప్రాంతంలో 300 ట్రాప్ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 7వ మైలు మార్గంలో చిరుతను గుర్తించారు. చిరుతను బంధించేందుకు తొమ్మిది బోనులను ఏర్పాటు చేశారు. చిరుత బోనుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోతుండటాన్ని ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. పలు వ్యూహాలను అమలుపర్చి చిరుత పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జామున చిరుత పులి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. ఇప్పటికే గతనెల జూన్ 24న ఓ చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. లక్షిత ఘటన తరువాత 14, 17వ తేదీల్లో రెండు చిరుతలను బంధించారు. తాజాగా సోమవారం మరో చిరుత బోనులో చిక్కడంతో రెండు నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు.
Operation Cheetah : 500 ట్రాప్ కెమెరాలు, 100మంది సిబ్బంది.. తిరుమలలో ముమ్మరంగా ఆపరేషన్ చిరుత
ఇదిలాఉంటే.. చిన్నారి లక్షితపై మూడు చిరుతల్లో ఏ చిరుత దాడిచేసిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లక్షితపై దాడి ఘటన తరువాత బోనులో రెండు చిరుతల నమూనాలను ముంబైలోని ల్యాబ్‌కు అధికారులు పంపించారు. రిపోర్టు రావాలంటే రెండు నెలలు సమయం పడుతుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, త్వరగా రిపోర్టు ఇవ్వాలని ల్యాబ్ అధికారులను కోరామని, త్వరలోనే ల్యాబ్ నుంచి రిపోర్టులు వస్తాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడు చిరుతలు బందీ కావడంతో.. ఆ చిరుతలను జూ లో క్వారంటైన్‌లో ఉంచారు. ముంబై నుంచి వచ్చే ల్యాబ్ రిపోర్టు ప్రకారం ఇప్పుడు బందీ అయిన మూడు చిరుతల్లో ఏ చిరుత లక్షితపై దాడి చేసిందనే విషయాన్ని నిర్ధారించుకొని, ఆ తరువాత చిన్నారిపై దాడిచేసిన చిరుత పులిని జూ లో బందీగా ఉంచి.. మిగతా చిరుతలను అటవీ ప్రాంతంలో అధికారులు వదలనున్నారు.