తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. న్యూఇయర్ వేళ కానుక ప్రకటించింది. ఇకపై శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశి నుంచి ఈ కొత్త విధానం అమలు చేయాలని టీటీడీ యోచిస్తోంది. మరోవైపు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా భక్తులు అదనంగా ఎన్ని లడ్డూలైనా నేరుగా కౌంటర్ దగ్గరే కొనుగోలు చేసే సౌలభ్యం కల్పించనుంది టీటీడీ. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు శ్రీకారం చుట్టిన బోర్డు.. ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం నడకదారి భక్తులకు, వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చేవారికి మాత్రమే ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు. ఇకపై వైకుంఠ ఏకాదశి నుంచి భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు అపురూపంగా భావించేది లడ్డూ ప్రసాదమే. లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుమల వెళ్లిన భక్తుడు ఎవరైనా లడ్డూ ప్రసాదం తీసుకోకుండా వెనుదిరగరు. అంతేకాదు.. ఎవరైనా తిరుమలకు వెళ్తే తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం గురించి అడుగుతారు.
Also Read : మీది ఉందా? : ఈ స్మార్ట్ ఫోన్లలో WhatsApp పనిచేయదు!