Hyderabad News: హైదరాబాద్ నగరంలో అల్లరిమూకలు హల్ చల్.. రోడ్డున పోయే వారిపై దాడి

కొందరు ఆకతాయిలు అమాయకులపై దాడులకు దిగుతున్నారు. రాత్రి సమయంలో బైక్ లపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి.

Hyderabad News

Hyderabad News: కొందరు ఆకతాయిలు అమాయకులపై దాడులకు దిగుతున్నారు. రాత్రి సమయంలో బైక్ లపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇక తాజాగా బాలాపూర్ ప్రాంతంలో కొందరు ఆకతాయిలు పనిపాట లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ బయటకు వచ్చిన వారిపై దాడి చేస్తున్నారు.

ఆకతాయిల వేధింపులకు విసిగిపోయిన బాలాపూర్ ప్రజలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీలో దాడుల దృశ్యాలు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఆకతాయిలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. దాడి చేస్తున్న ఆకతాయిలు పోలీసులు అనుకోని కొందరు కాముగా వెళ్ళిపోతున్నారట. స్థానికుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా ఇటువంటి ఘటనే గతంలో అంబర్ పెట్ ప్రాంతాల్లో కూడా చోటుచేసుకుంది. గంజాయి బ్యాచ్ దారినపోయే వాహాలను ఆపి దాడులకు దిగేవారు. వీరిపై పోలీసులు కఠినంగా వ్యవహరించి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు.