వంశీని పిలిచి యార్లగడ్డతో చేతులు కలిపించిన సీఎం జగన్, కలిసి పనిచేయాలని సూచన

  • Publish Date - October 8, 2020 / 03:40 PM IST

gannavaram: గన్నవరం వైసీపీలో విబేధాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇద్దరు నేతలకు కలసి పని చేసుకోవాలని సూచించారు. పునాదిపాడులో విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు. ఆ సమయంలో యార్లగడ్డ వెంకట్రావు జగన్‌ను కలిశారు. పక్కనే ఉన్న వంశీని పిలిచి యార్లగడ్డ వెంకట్రావుతో చేతులు కలిపించారు జగన్. కలసి పని చేయాలని ఇద్దరికి సూచించారు.

గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో వల్లభనేని టీడీపీ తరపున పోటీ చేసి వెంకట్రావుపై గెలిచారు. అయితే ఆ తర్వాత పరిణామాలు మారాయి. వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. అప్పట్నుంచి రెండు వర్గాల మధ్య ఉప్పునిప్పులా ఉంది పరిస్థితి. నాలుగు రోజుల క్రితం కూడా యార్లగడ్డ పుట్టినరోజు సందర్భంగా ర్యాలీపై కూడా వివాదం నడిచింది. ఆ సమయంలో వంశీతో కలిసి నడిచేది లేదని యార్లగడ్డ ప్రకటించారు. ఇప్పుడు జగన్ ఆ ఇద్దరి చేతులు కలిపించారు.

ట్రెండింగ్ వార్తలు