రాజధానిగా విశాఖ బెస్ట్.. తుఫాన్లు అన్ని ప్రాంతాల్లోనూ వస్తాయి : జీఎన్ రావు

  • Publish Date - January 29, 2020 / 11:11 AM IST

ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ ఆప్షన్ అని జీఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. ఇక తుఫాన్ల విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. కాగా, విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలని మేము చెప్పలేదని.. తీర ప్రాంతానికి దూరంగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా సూచించినట్టు జీఎన్ రావు చెప్పారు. విశాఖ రాజధాని గురించి పత్రికలో వచ్చిన కథనాలపై జీఎన్ రావు స్పందించారు. విశాఖకు తుఫాన్ల ముప్పు ఉందన్న అంశం దాచిపెట్టారనే విషయంపై ఆయన వివరణ ఇచ్చారు.

బుధవారం(జనవరి 29,2020) మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ అసమానతలు తగ్గించేలా ప్రభుత్వానికి సూచనలు చేశామన్నారు. మా రిపోర్టులను కొందరు తగలబెట్టారని.. అది చాలా బాధాకరం అని వాపోయారు. రాయలసీమ ప్రజలు విశాఖ రావడానికి ఇబ్బంది అవుతుందన్న జీఎన్ రావ్.. అందుకే పూర్తి అధికారాలతో 4 రీజనల్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామన్నారు.

GN Rao కామెంట్స్:
* రాజధానిగా విశాఖ బెస్ట్
* అభివృద్ధి వికేంద్రీకరణతోనే పేదరిక నిర్మూలన
* విశాఖ-విజయనగరం రూట్ లో భనవాలు నిర్మించుకోవాలని సూచించాం
* విశాఖలో సముద్ర తీరానికి దూరంగా అభివృద్ధి చేయాలని సూచించాం
* విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి గురించే చెప్పాం

* నగరాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించాం
* 13 జిల్లాలను 4 జోన్లుగా చేయాలని సూచించాం
* వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించి.. నివేదిక ఇచ్చాం
* అభివృద్దికి అవసరమైన సూచనలు ప్రభుత్వానికి నివేదించాం
* మా రిపోర్టులను కొందరు తగలబెట్టారు, అది చాలా బాధాకరం

* విశాఖ, విజయవాడ, మచిలీపట్నంలోని వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశాం
* పెట్టుబడులకు అనువైన ప్రాంతం విశాఖ
* విశాఖతో సంబంధం లేకుండా రాజధాని ఏర్పాటు చేస్తే.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అభివృద్ధి చెందుతాయి
* విశాఖ మెట్రోపాలిటన్ పరిధిలో రాజధాని ఉండాలని చెప్పాం
* ప్రజలు, అధికారులు, పోలీసులు, కలెక్టర్లతో సంప్రదించే రిపోర్టు రూపొందించాం

* రాయలసీమ ప్రజలు విశాఖ రావడానికి ఇబ్బంది అవుతుంది
* అందుకే పూర్తి అధికారాలతో 4 రీజనల్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని సూచించాం
* విశాఖ-చెన్నై కారిడార్ ఏర్పాటుతో అభివృద్ధి వస్తుంది
* తీర ప్రాంతానికి దూరంగా కేపిటల్ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా చెప్పాం
* సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు వస్తాయి