Gold Price Today: మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. 80వేలకు చేరువలో కిలో వెండి రేటు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకుంది. 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగగా, కిలో వెండిపై రూ. 700 వరకు పెరుగుదల చోటు చేసుకుంది.
- Harishth Thanniru
- Published On : September 17, 2023 / 07:38 AM IST
Gold price
Gold and Silver Price Today: బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి కిలో ధర భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాములు బంగారంపై రూ. 220 పెరుగుదల చోటు చేసుకుంది. అదేవిధంగా కిలో వెండిపై రూ. 700 పెరిగింది.
Gold
తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,890కి చేరింది.
Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే..
-దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,040కు చేరింది.
– ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,890కి చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ పై రూ. 300 పెరిగింది.అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 320 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,300కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 60,320కు చేరింది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,900 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 59,890కు చేరింది.
– కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,890కి చేరింది.
Gold
దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ. 700 పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో కిలో వెండి ధర పలు నగరాల్లో రూ.80వేలకు చేరువైంది. దేశవ్యాప్తంగా వెండి ధరలను పరిశీలిస్తే .. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,200 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 74,700, చెన్నైలో రూ. 78,200, ముంబయిలో రూ. 74,700, కోల్‌కతాలో 74,700, బెంగళూరులో రూ. 73500 వద్ద కొనసాగుతుంది.
