Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం ధరలను పరిశీలిస్తే .. బుధవారం కంటే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 150 తగ్గుదల చోటు చేసుకుంది.

Gold Rate

Gold and Silver Rate Today: గత నెల ప్రారంభం వరకు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కొంతకాలంగా గోల్డ్ ధరలు తగ్గుకుంటూ వస్తున్నా.. మధ్య మధ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడం, పెళ్లిళ్ల సీజన్‌కుతోడు వరుస పండుగలు వస్తుండటంతో బంగారం ధర కాస్త పెరిగింది. గోల్డ్ దుకాణాలుసైతం రద్దీగా మారాయి. అయితే, గత మూడు రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా గోల్డ్ ధరలు పడిపోతున్నాయి. ఔన్సుకు 1919 డాలర్ల మార్కుకు గోల్డ్ రేటు దిగొచ్చింది. సిల్వర్ రేటు మాత్రం 23 డాలర్లపైనే ట్రేడవుతోంది. ఇక్కడ ధరల్లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగానే దేశీయ మార్కెట్ లలో కూడా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం ధరలను పరిశీలిస్తే .. బుధవారం కంటే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 150 తగ్గుదల చోటు చేసుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 160 తగ్గుదల చోటుచేసుకుంది. దీంతో గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,000కాగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60వేల వద్ద కొనసాగుతోంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,200 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,330గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55వేలు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60వేలుగా ఉంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో బుధవారం కిలో వెండి 79,000 ఉంటే.. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం కిలో వెండి రూ. 78,500గా ఉంది. మూడు రోజుల్లో వెండి ధర రూ. 1500 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో కిలో వెండి రూ. 74,700గా ఉంది. బెంగళూరులో రూ. 73,750, చెన్నైలో రూ. 78,500, ముంబయిలో రూ. 74,700గా ఉంది.