Gold Price Today: గోల్డ్ రేటు తగ్గింది..! తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలాఉన్నాయంటే..

దేశంలో ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో కిలో వెండి ధర ..

Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్ వేళ పసిడి ప్రియులకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు దిగిరావడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో బంగారం ఆభరణాల కొనుగోలుకు ఇదే మంచి తరుణమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర రూ. 55,150 వద్ద ఉంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. మంగళవారంతో పోల్చితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ. 150 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. దీంతో బుధవారం ఉదయం నమోదైన ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గా ఉంది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,490గా ఉంది.
– ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160గా ఉంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో కిలో వెండి రూ. 75,200 కాగా, చెన్నైలో 79,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 75,500 కాగా, ముంబయిలో రూ. 75,200 గా ఉంది. అయితే, ఇవి కేవలం బుధవారం ఉదయం నమోదైన ధరలు మాత్రమే. ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు