Representative Image (Image Credit To Original Source)
Vijayawada Durgamma Temple: విజయవాడ దుర్గమ్మ ఆలయం క్యూలైన్ లో భారీ చోరీ జరిగింది. భక్తురాలి దగ్గరి నుంచి 50 లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న విజయవాడ వన్ టౌన్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పరిసరాల్లో టెంట్లు వేయడంతో సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డ్ కాలేదని తెలుస్తోంది.
బాధితురాలు హైదరాబాద్ నుంచి విజయవాడలో జరిగే పెళ్లికి వచ్చింది. విజయవాడ వచ్చిన సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్లాలని అనుకున్నారు. ఈలోపే భక్తురాలి దగ్గర 50 లక్షల విలువైన బంగారం చోరీ అయ్యింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ భారీ రద్దీ ఉంది. ఇదే అదనుగా దొంగ రెచ్చిపోయారు. మహిళ బ్యాగులో నుంచి బంగారం చోరీ చేశారు.
శుక్రవారం నుంచి దుర్గమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. 8వ తేదీ వరకు జరుగుతాయి. కుంభాభిషేకం మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయంలో ఎక్కడికక్కడ టెంట్స్ వేశారు అధికారులు. సీసీ కెమెరాల్లో టెంట్లు అడ్డుగా రావడంతో పోలీసులకు దొంగను కనిపెట్టడం తలనొప్పిగా మారింది.
Also Read: గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లో పేలుడు కలకలం.. నలుగురికి గాయాలు