పెన్షన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

నగదు బదిలీ ద్వారా 47లక్షల 74వేల 733 మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.

Pension Money : పెన్షన్ డబ్బులకు సంబంధించి పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొత్తం పెన్షనర్ల సంఖ్య 65లక్షల 30వేల 808. పెన్షన్ సొమ్ము మొత్తం రూ.1,939.35 కోట్లు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47లక్షల 74వేల 733 మంది బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపారు.

జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి 17లక్షల 56వేల 105 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ/వార్డు పరిపాలనా కార్యదర్శులు పెన్షన్ డబ్బును మే 31న డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు