Cm Chandrababu Naidu Representative Image (Image Credit To Original Source)
Cm Chandrababu: అసలే సెన్సిటీవ్ మ్యాటర్. కోట్ల మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం. సిట్ రిపోర్ట్‌తో ఏర్పడిన గందరగోళం. పొలిటికల్‌గా కార్నర్ అయ్యే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఏం చేద్దాం? ప్రజలకు వాస్తవాలను వివరించేదెలా..? ఎలా ముందుకెళ్దాం? కల్తీ నెయ్యి ఇష్యూను ఇక నుంచి ఎలా డీల్ చేద్దాం? ఇదే ఇప్పుడు కూటమి పార్టీల మేథోమధనం. ఇంకా లాగొద్దు..అలాగని వదలిపెట్టొద్దని డిసైడ్ అయిన కూటమి పెద్దలు..ఐక్యంగా లౌక్యంతో బిహేవ్ చేయాలని డిసైడ్ అయ్యారు. తిరుమల లడ్డూ ఎపిసోడ్‌లో కూటమి ఫ్యూచర్ ప్లానేంటి? కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో క్లైమాక్స్ ఎప్పుడు?
కల్తీ నెయ్యి ఇష్యూపై రాజకీయ వేడి అంతకంతకు రాజుకుంటూనే ఉంది. సిట్ రిపోర్ట్ చుట్టూ పెద్ద రచ్చే నడుస్తుండగా..జంతువుల కొవ్వు ఉందంటూ చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అటాక్‌కు దిగుతోంది వైసీపీ. ఈ విషయాన్ని కూటమి సీరియస్‌గా తీసుకుంటోంది. కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో వారం, పది రోజులుగా జరుగుతున్న డెవలప్‌మెంట్స్‌పై కూటమి పెద్దలు పిన్ టు పిన్ అబ్జర్వేషన్‌లో పెట్టారట. పూర్తిస్థాయిలో ప్లస్‌లు, మైనస్‌లను బేరీజు వేసుకున్నాక..సోషల్ మీడియా ప్రచారం..వైసీపీ కవర్ డ్రైవ్‌పై అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేయాలని డిసైడ్ అయ్యారట.
ఇప్పటికే విచారణ కమిషన్‌ను వేసిన కూటమి ప్రభుత్వం..చాలా సున్నితమైన అంశాన్ని ఇంకా సెన్సిటీవ్‌గా డీల్ చేయాలని నిర్ణయించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ గతంలో చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పటికీ దుమారం నడుస్తుండటంతో..కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో ఇక నుంచి ఏం చేద్దామనేదానిపై కూటమి బిగ్ ప్లాన్ చేస్తోందట. ఈ ఇష్యూను ఇంతటితో వదిలేయొద్దు..అలా అని మరీ సాగదీయొద్దని కూడా భావిస్తున్నారట. సేమ్‌టైమ్ వైసీపీ ట్రాప్‌లో పడొద్దని కూడా కూటమి నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్‌తో పాటు మంత్రులు, మూడు పార్టీల నేతలతో సమావేశమై అనేక అంశాలు చర్చించారు. కల్తీ నెయ్యి చుట్టూ జరుగుతున్న రచ్చ..రాజకీయ ఘర్షణలు..సిట్ రిపోర్ట్‌ను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరుపై డిస్కస్ చేశారట. ఐక్యంగా ముందుకెళ్లి..లౌక్యంతో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని క్లైమాక్స్‌కు చేర్చాలని కన్‌క్లూజన్‌కు వచ్చినట్లు చెబుతున్నారు.
వైసీపీ వాళ్లు దేవుడితోనే పెట్టుకున్నారని..ఘోరమైన నేరo చేసి మహా పాపానికి ఒడికట్టి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడుతున్నారు కూటమి పెద్దలు. విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ముచ్చటే లేదని..కల్తీ పాపం ఎవరిదో తేల్చి తీరుతామంటున్నారు. అలా అని తొందరపడేది లేదు. ప్రతీమాట భక్తుల మనోభావాలు, సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం. దేవుడి విషయాన్ని రాజకీయం చేయకూడదనే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామంటున్నారు. సేమ్ టైమ్ ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే అసలు నిజాలేంటో వివరించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు కూటమి లీడర్లు.
అంతేకాదు ఏపీలో ఏం జరిగినా అధికార కూటమివైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు..దాడుల ఇష్యూ అలా ఉంటే..జోగి రమేష్ ఇంటిపై దాడిలో కొందరి అత్యుత్సాహం సరికాదన్న అభిప్రాయానికి వచ్చారట. వైసీపీ నేతలు రెచ్చగొడితే..పలుచోట్ల కూటమి నేతలు వారి ట్రాప్‌లో పడిపోతున్నారని..ఇక మీద ఎవరూ అతిగా రియాక్ట్ కాకుండా అలర్ట్‌గా ఉండాలని కూడా అందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్లాయట.
మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అందుకే ప్రభుత్వంపై వైసీపీ చేసే ఏ విమర్శకైనా అంతా కలిసికట్టుగానే..మూడు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు లైన్ క్రాస్ చేయకుండా..అనవసర విషయాల జోలికి వెళ్లకుండా..సెన్సిటివ్ టాపిక్స్‌ను టచ్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారట. వైసీపీకి అస్సలే చాన్స్ ఇవ్వొద్దనేది కూటమి పెద్దల ఆలోచన అంటున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉందని..వైసీపీ ట్రాప్‌లో పడి చేజేతులా డ్యామేజ్ చేసుకోవద్దని లీడర్లతో సహా క్యాడర్ కూడా కేర్ ఫుల్‌గా ఉండాలన్నది కూటమి పెద్దల మాటగా చెబుతున్నారు.
సిట్ రిపోర్ట్‌లో ఏముంది.? అంతకముందు టీటీడీ ల్యాబ్స్ ఇచ్చిన నివేదికల్లో చెప్పిందేంటి.? 2022లో వచ్చిన కల్తీ నెయ్యి రిపోర్ట్ ఎందుకు పక్కన పెట్టారు.? అసలు నెయ్యి టెండర్ల నిబంధనలు ఎందుకు మార్చారు.? విచారణ కమిషన్‌కు ఇవ్వబోయే టాస్క్ ఏంటన్నదానిపై ఇన్ డిటైల్డ్ డిస్కషన్ చేశారట. లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌ను చూస్తుంటే ఓవరాల్‌గా కూటమి పార్టీల పెద్దలు అలర్ట్ అయ్యారని అంటున్నారు. కొద్దిరోజులు సిట్ రిపోర్ట్‌ను బేస్ చేసుకుని వైసీపీ చేస్తున్న ఎదురుదాడిపై కూటమి పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కల్తీ నెయ్యి ఇష్యూలో ఎవరు పైచేయి సాధించారన్నది పక్కన పెడితే..భవిష్యత్‌లో భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా..అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలన్నది చంద్రబాబు, పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
Also Read: తిరుమలపై ఆ జీవో ఇచ్చిందే వైఎస్ఆర్.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబునే మించిపోయారు- పేర్నినాని