Gossip Garage : అధికారంలో ఉన్నాం..హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటే కుదరదు. ఈసారి మునుపటి లెక్క కాదు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం..ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ప్రతీ విషయంలో జవాబుదారీగా ఉండాల్సిందే. అది నేను అయినా మీరైనా అంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆరు నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగటంతో పాటు..పనితీరు బాలేని వాళ్లకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ అయిన బాబు..ట్రాక్ తప్పిన ప్రజాప్రతినిధులను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మంత్రులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కొత్త ట్రెండ్ ఎందుకు స్టార్ట్ చేసినట్లు.?
6 నెలల పాలనపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్..
చంద్రబాబు. సీఎం అనే హోదా కంటే మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. విజినరీ లీడర్‌గా జాతీయ స్థాయిలోనూ బాబుకు మంచి ఇమేజ్ ఉంది. పరిపాలన పరంగా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా..హాట్ టాపికే. ఇప్పుడు మరో కీ డెసిషన్‌తో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడుతున్నారట. మంత్రులు సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారట. దాని ఆధారంగా ఆరు నెలల పాలనపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారు.
పాలనపై ప్రజలు హ్యాపీగా ఉన్నారా? లేదా?
పవర్ దక్కింది ఎంజాయ్ చేసేందుకు కాదు..పబ్లిక్ సేవ చేసేందుకు. ప్రతీ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. తప్పులు ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాలని సూచిస్తున్నారట చంద్రబాబు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆరు నెలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిందేంటి? ప్రభుత్వ పథకాలు, పాలసీలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనే దానిపై ఫీడ్‌బ్యాక్ తీసుకోబోతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12వ తేదీతో 6 నెలలు పూర్తి చేసుకుంటోంది. మరి ఈ పాలనపై ప్రజలు హ్యాపీగా ఉన్నారా? జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ప్రభుత్వ పథకాలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు బాగుందా? లేదా? అనే అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, మంత్రులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడుతున్నారు.
నేరుగా లబ్ధిదారులకే కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్..
ఈ ఆరు నెలల్లో ఎవరు ఏం చేశారు? ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో.. సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారట. అంశాల వారిగా మొత్తం వర్క్ షీట్‌ను డిసెంబర్ 12లోపు తన ముందుంచాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పరీక్షల్లో పాసయ్యేందుకు, మంచి మార్కులు తెచ్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చే వర్క్ షీటే కాకుండా గ్రౌండ్ రియాల్టీపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నారు. IVRS విధానం ద్వారా నేరుగా లబ్ధిదారులకే కాల్స్ చేసి..పథకాల అమలు, అందుతున్న సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారట. ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు. మెయిన్‌గా పెన్షన్లు ఇంటి దగ్గరే అందుతున్నాయా? లేదా? ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటంలో ఇబ్బందులున్నాయా? లాంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం, నూతన మద్యం విధానం సహా ఇతర పాలసీలపైనా ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని వార్నింగ్..
ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలర్ట్‌గా ఉంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధుల తరఫున పొరపాట్లు జరగకుండా చూస్తున్నారు. ఎమ్మెల్యేల, మంత్రుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటల్లోనే మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి.. ఓ ఎస్‌ఐ విషయంలో వ్యవహరించిన తీరు కాంట్రవర్సీ అయింది. వెంటనే సదరు ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు..మంత్రికి ఫోన్ చేసి మందలించారు. తర్వాత సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూలోనూ వెంటనే రియాక్ట్ అయి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసి..ఫోన్‌లో మందలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కాంట్రవర్సీ కామెంట్స్ విషయంలోనూ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్‌గా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య బూడిద పంచాయితీ విషయంలోనూ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ప్రజలకు ఎంత మంచి చేశామన్న దానికంటే వాళ్లతో ఎలా బిహేవ్ చేశామన్నదే ఇంపార్టెంట్..
బిహేవియర్ ఇంపార్టెంట్ అన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలకు ఎంత మంచి చేశామన్న దాని కంటే వాళ్లతో ఎలా బిహేవ్ చేశామన్నదే ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు చంద్రబాబు. సమస్య చెప్తే సామరస్యంగా విన్నామా లేదా అనేదే పనితీరుకు గీటురాయిగా ఉంటుందంటున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేల తీరు సరిగ్గా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదని..అందుకే ఎప్పటికప్పుడు సెట్‌రైట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు మంత్రుల సెల్ఫ్ అసెస్మెంట్‌తో వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో విడివిడిగా మాట్లాడారట బాబు. పనితీరు బాలేని వారికి పలు సూచనలు చేశారని తెలుస్తోంది. ఇసుక, లిక్కర్ దందాల్లో వేలు పెట్టి ప్రభుత్వం పరువును రోడ్డు మీద వేయొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ప్రజాప్రతినిధుల్లో బాబు ఎంతవరకు మార్పు తీసుకురాగలరో?
ఈసారి పవర్‌లోకి వచ్చాక గాడి తప్పిన వ్యవస్థను ట్రాక్‌లో పెట్టడంపైనే ఫోకస్ పెట్టారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యే పనితీరు బాగుండేలా చూస్తున్నారు. చెప్పినట్లుగా పని చేయకపోతే అవసరమైతే ఇంకొకరిని పెట్టుకుంటామని కూడా బాబు చెప్తున్నట్లు తెలుస్తోంది. సెల్మ్ అసెస్మెంట్‌లో పాసయ్యే మంత్రులు ఎవరో? ప్రజాప్రతినిధుల్లో బాబు ఎంతవరకు మార్పు తీసుకురాగలుగుతారో చూడాలి మరి.
Also Read : ఇక నుంచి నిఘా నీడలో కాకినాడ పోర్టు.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత?