×
Ad

Chandrababu: నెలలో ఒకటి రెండుసార్లు భేటీ.. చంద్రబాబు, పవన్‌ వరుస సమావేశాల వెనుక మ్యాటరేంటి?

పైస్థాయిలో చంద్రబాబు, పవన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నా..గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడో ఓ చోట క్లాషెస్‌ రచ్చకెక్కుతుండటం కూటమికి హెడెక్‌గా మారాయి.

  • Published On : March 4, 2026 / 09:00 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • బాబుతో పవన్ భేటీలు..ఆల్‌ ఈజ్ వెల్‌ అంటూ ఇండికేషన్స్‌..
  • నెలలో ఒకటి, రెండు భేటీలు..ఇంటర్నల్ మీట్‌లో కీలక డెసిషన్స్
  • సింగిల్‌ లైన్‌..ఒకటే ఎజెండా అంటూ దూసుకెళ్తున్న కూటమి
  • కీలక పరిణామాల వేళ ఆ ఇద్దరి భేటీలో ఆసక్తికర నిర్ణయాలు

 

Chandrababu: ఒకటే ఎజెండా. ఒకటే లైన్. నో క్లాషెన్. కమ్యూనికేషన్ గ్యాప్స్‌కు ఛాన్సే లేదు. డెసిషన్ ఏదైనా..మ్యాటర్ మరేదైనా కలిసే నిర్ణయం తీసుకుంటాం. కలిసిగట్టుగానే ముందుకెళ్తామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కూటమి భాగస్వామ్య పార్టీల రథసారధులుగా కీలకంగా ఉన్న ఇద్దరు టాప్ లీడర్లు..వరుస పెట్టి..నెలలో ఒకటి రెండుసార్లు భేటీ అవుతుండటం సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది. చంద్రబాబు, పవన్‌ సమావేశాల ఔట్‌ పుట్‌ ఏంటి? ఏయే టాపిక్స్‌పై డిస్కస్ చేసి ఉంటారు?

ఆ ఇద్దరు వన్‌ టు వన్‌ భేటీ అయ్యారు. కూటమిలో రెండు కీలక పార్టీల అధ్యక్షులు. పైగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమావేశంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్‌ చర్చ జరుగుతోంది. వరుస పెట్టి భేటీల వెనుక మ్యాటరేంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ మధ్య రెగ్యులర్‌గా భేటీ అవుతూ పొలిటికల్ హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. అటు అసెంబ్లీ సమావేశాల్లో కలుసుకుంటున్నారు. మంత్రివర్గ సమావేశాల్లోనే పక్కపక్కనే కూర్చుంటారు. అయినా ఆ ఇద్దరు ప్రత్యేకంగా భేటీ అవుతుండటం కూటమి నేతల్లో, జనాల్లో తెలియని క్యురియాసిటీని పెంచేస్తోంది.

బాబు, పవన్ ఇద్దరూ రోజంతా అసెంబ్లీలో కనిపిస్తున్నారు. అటు మంత్రివర్గ భేటీలో కూడా కలిసే ఉంటారు. నెక్ట్స్‌ డే స్పెషల్‌గా వన్ టు వన్ భేటీ అవుతున్నారు. అలా వన్‌ టు వన్‌ భేటీ జరిగిందంటే ఏదో కీలక అంశాలపై డిస్కస్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాల మీదనే ఈ ఇద్దరు చర్చించి ఉంటారని అంటున్నారు.

ఈ మధ్యే బాబు, పవన్ భేటీ జరిగింది. కల్తీ నెయ్యి ఇష్యూతో పాటు..పలు అంశాలపై డిస్కస్ చేశారు. ఆ తర్వాత కూటమి పార్టీల కంబైన్డ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి సంకేతాలు ఇవ్వగలిగారు. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి బాబు, పవన్ సమావేశం జరిగింది. అది కూడా ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగా బాబు, పవన్ సమావేశానికి ముందు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఆ టాపిక్‌ మీదే వారి భేటీలో డిస్కషన్ జరిగినట్లు ప్రచారం నడుస్తోంది.

ఇంటర్నల్ వార్‌కు ఎప్పటికప్పుడు చెక్..

ఈ మధ్య ఒంగోలు కూటమి రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జనసేన నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్ మరోసారి రచ్చకెక్కింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో తగ్గేదేలే అంటున్నారు ఆ ఇద్దరు లీడర్లు. సేమ్‌టైమ్ అక్కడక్కడ జనసేన, టీడీపీ యాక్టివిస్టుల మధ్య ఇన్‌సైడ్‌ వార్ కొనసాగుతోంది. పైస్థాయిలో చంద్రబాబు, పవన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నా..గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడో ఓ చోట క్లాషెస్‌ రచ్చకెక్కుతుండటం కూటమికి హెడెక్‌గా మారాయి. ఈ ఇంటర్నల్ వార్‌కు ఎప్పటికప్పుడు చెక్ పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలోనే చంద్రబాబు, పవన్‌ భేటీలో కీలక డెసిషన్ తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

కూటమిలో రెండు పార్టీల క్యాడర్ నుంచి మొదలెట్టి లీడర్ల దాకా అంతా కలసికట్టుగా ఉండాలని టీడీపీ, జనసేన చీఫ్‌లు ఎప్పటికప్పుడు కోరుతూనే ఉన్నారు. ఏ ఇబ్బందులు, సమస్యలు ఉన్నా కూర్చుని సర్దుబాటు చేసుకోవాలని చెబుతున్నారు. అలకలు, అసంతృప్తులు సహజం..వాటిని పెద్దవి చేయకుండా సాఫీగా పరిష్కారం చేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తున్నారు. అయినా కొంత గ్యాప్ అయితే అక్కడక్కడ కొనసాగుతోంది. వాటికి ఎలా చెక్ పెట్టాలనేది టాప్‌ ప్రయారిటీగా తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోవడం..కూటమి పార్టీల మధ్య క్లాషెస్‌ వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారే ప్రమాదం ఉండటంతో వీలైనంత త్వరగా అంతా సెట్‌రైట్‌ చేయాలని భావిస్తున్నారట. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీ ఏకంగా రెండు గంటలకు పైగా సాగింది. పాలనాపరమైన అంశాల నుంచి రాజకీయ అంశాల దాకా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. ఏపీలో విపక్ష వైసీపీ వ్యవహార శైలి, మండలిలో ఛైర్మన్ తీరు..రాజ్యసభ సీట్లపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు.

ఏపీలో ఇంకా కొన్ని కీలక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. తొందరలోనే నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిపై కూడా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీకి రెండు, బీజేపీ, జనసేనకు చెరో రాజ్యసభ సీటు అన్నది ఐదారు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సీట్ల కోసం ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. అయితే ఎవరిని నామినేట్ చేయాలన్నది చర్చించి ఉండే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సెషన్ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. దాంతో ఈ సమావేశాలు ముగిసేలోపు చేపట్టాల్సిన వ్యూహంపై చర్చించారని అంటున్నారు.

మరింత పటిష్టమైన వ్యూహంతో ముందుకు..

అయితే లేటెస్ట్‌గా వైసీపీ కాస్త దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి ఇష్యూలో సిట్‌ రిపోర్ట్ తర్వాత చాలా మంది లీడర్లు లైమ్‌ లైట్‌లోకి రావడం..కూటమిపై డైరెక్ట్‌ అటాక్ చేస్తుండటంతో..మరింత పటిష్టమైన వ్యూహంతో ముందుకెళ్లే ఆలోచన చేస్తోందట కూటమి. ప్రతీ అంశాన్ని రాజకీయంగా పీక్స్‌కు తీసుకెళ్తున్న ఫ్యాన్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలన్నదే చంద్రబాబు, పవన్ డెసిషన్ అంటున్నారు. అయితే చంద్రబాబు, పవన్ ఇద్దరు కీలక శాఖలు చూస్తున్నారు. అవన్నీ నిధులు ఉంటేనే పనిచేయగలిగే శాఖలు.

అలాంటి ఇంటర్నల్‌ అంశాలే కీలకమైనా..ప్రతీసారి ఈ ఇద్దరి భేటీతో అయితే ఇటు కూటమి పార్టీల క్యాడర్‌కు, అటు ప్రజలకు పాజిటివ్ ఇండికేషన్సే వెళ్తున్నాయని చెబుతున్నారు. వారి భేటీ కంటే ముందు జరుగుతున్న రాజకీయ రచ్చ, ప్రజా సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో ఓ కన్‌క్లూజన్‌కు వస్తున్నారని అంటున్నారు. సేమ్‌టైమ్‌ కూటమి బలంగా పటిష్టంగా ఉందని మిత్రుల మధ్య సయోధ్య ఉందన్న సందేశం వెళ్తుందని చర్చించుకుంటున్నారు.

Also Read: విపరీతమైన కోరికలు, జూదం ఇంకా.. ఈ మందు వాడితే మటాషే? భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..