Payyavula Keshav: ఈడీ.. రెడీ.. ఎందుకు, ఏ కేసులో? ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్‌గా పయ్యావుల కామెంట్స్
ఇప్పటివరకు దేశంలో నమోదైన పలు ఈడీ కేసులు..వాటిలో పలువురు రాజకీయ నేతలు పడ్డ అవస్థలను దృష్టిలో తలుచుకుని..ఈడీ ఎంటర్ అయితే పరిస్థితి ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
- Naveen
- Published On : March 13, 2026 / 08:50 PM IST
Payyavula Keshav Representative Image (Image Credit To Original Source)
- ఈడీ రాబోతోంది రెడీగా ఉండండి
- బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్
- ప్రభుత్వ శాఖల్లో దోపీడీపై ఈడీ నజర్ పెట్టనుందా?
Payyavula Keshav: మండలిలో ఫైట్ అయిపోయింది. అసెంబ్లీలోనూ కూటమి చెప్పాల్సింది చెప్పింది. ఇక ప్రెస్‌మీట్లలోనూ వైసీపీ అధినేత లేవనెత్తుతున్న ప్రశ్నలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. సభకు రావాల్సి కదా సార్ అంటూనే..మీ దోపీడీ లెక్కలన్నీ ప్రజల్లో చర్చకు పెడతామంటూ అటాక్ చేస్తోంది. వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని దుమ్మెత్తిపోస్తూనే..బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. ఈడీ రాబోతోంది రెడీగా ఉండాలంటూ చేసిన కామెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయ్. ఇంతకు పయ్యావుల కామెంట్స్ వెనుక మతలబేంటి? ప్రభుత్వ శాఖల్లో దోపీడీపై ఈడీ నజర్ పెట్టనుందా?
వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసానికి అప్పుల భారం మోస్తున్నాం..
ఏపీలో అధికార కూటమికి విపక్ష వైసీపీకి మధ్య రాజకీయ యుద్ధం నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే అసెంబ్లీ, మండలి వేదికగా వైసీపీ హయాంలో అంతా దోపిడీ అంటూ ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేసింది కూటమి. మండలిలో అయితే కాగ్ రిపోర్ట్ సెంట్రిక్‌గా పెద్ద చర్చ, వాగ్వాదమే నడిచింది. ఇక సభా సమరం అయిపోయింది. జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం విధానాలపై అటాక్ చేశారు. అటు కూటమి నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తోంది. కూటమి 20 నెలల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. అప్పుల కుప్ప ప్రభుత్వం అని..తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల కంటే కూటమి చేసిన రుణాలే ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెప్పుకొచ్చారు జగన్. వైసీపీ అధినేతకు కూటమి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికే తాము అప్పుల భారం మోస్తున్నామని రివర్స్ అటాక్‌కు దిగుతున్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక దోపిడీ, విధ్వంసం జరిగిందని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసిందని పయ్యావుల గుర్తు చేస్తున్నారు.
ఈడీ రెడీ.. మ్యాటర్ వెరీ సీరియస్..
అయితే జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందన్న లెక్క తీయడానికి ఈడీ రెడీగా ఉందని సంచలన కామెంట్స్ చేశారు పయ్యావుల. దీంతో వైసీపీ హయాంలో ఆర్ధికంగా చేసిన తప్పులపై ఈడీ విచారిస్తుందని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. అదే కనుక జరిగితే వైసీపీకి సవాళ్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. ఆర్థిక దోపిడీపై ఈడీ దర్యాప్తు అంటే వ్యవహారం చాలా దూరం వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. ఈడీ ఫీల్డ్‌లోకి దిగుతుందంటే మ్యాటర్ వెరీ సీరియస్ అని కూటమి పెద్దలు వైసీపీకి చెప్పకనే చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ ఆరా తీస్తోంది. పలువురు నిందితులను విచారించిన ఈడీ..మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. రూ.400 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇక అక్రమ మైనింగ్ వ్యవహారంపై కూడా ఫోకస్ పెట్టిన ఈడీ ఆస్తులు అటాచ్ చేయడం ఒక ఎత్తు అయితే..దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇలా కీలక శాఖల్లో వైసీపీ హయాంలో తప్పిదాలు జరిగాయంటూ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేస్తోంది. అది అలా ఉండగానే ఈడీ రాబోతుందంటూ పయ్యావుల కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా ఏయే అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టనుందనే..సస్పెన్స్‌గా మారింది.
అసలు ఈడీ ఎంట్రీ ఎప్పుడు.. ఏ ఇష్యూలో ఉండబోతోంది?
వైసీపీదే ఆర్థిక దోపిడీ అని కూటమి చెప్తోంది. ఆ ఆర్థిక దోపిడీ ఏయే శాఖల్లో జరిగినట్లు కూటమి దగ్గర ఆధారాలున్నాయా? ఈడీ ఎంటర్ కానుందా? అయితే ఏ అంశాలపై ఫోకస్ చేయనుందనే పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ బయటపడని..అంతుచిక్కని వ్యవహారం ఏమైనా ఉందా? ఆ లెక్కలను తేల్చేందుకు ప్రభుత్వం ఈడీకి లేఖ రాయబోతోందా? అసలు ఈడీ ఎంట్రీ ఎప్పుడు..ఏ ఇష్యూలో ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు, నకిలీ లిక్కర్ కేసు, మైనింగ్, స్యాండ్ కేసుల్లో కేసులు..ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతూ వస్తోన్న వైసీపీ లీడర్లకు ఈడీ పేరు ఎత్తితే చాలు కలవరం మొదలవుతోందట. ఇప్పటివరకు దేశంలో నమోదైన పలు ఈడీ కేసులు..వాటిలో పలువురు రాజకీయ నేతలు పడ్డ అవస్థలను దృష్టిలో తలుచుకుని..ఈడీ ఎంటర్ అయితే పరిస్థితి ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పయ్యావుల చెప్పినట్లు ఈడీ ఎప్పుడు..ఏ కేసులో..ఎంటర్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: ఏపీలో రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్
