×
Ad

Ganta Srinivasa Rao: గంటాకు గుడ్‌‌టైమ్ స్టార్ట్‌ అయినట్లేనా? త్వరలో పెద్ద పోస్ట్‌ దక్కబోతోందా? ఏంటా పదవి..

గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి ఓ రేంజ్‌లో హవా నడిపించిన ఆయన..18నెలలుగా తనకు ఇష్టమైన పదవి దక్కకపోవడంతో అన్ హ్యాపీగా ఉన్నారట.

Ganta Srinivasa Rao Representative Image (Image Credit To Original Source)

  • ఉత్తరాంధ్ర సెంట్రిక్‌గా గంటాకు ప్రమోషన్ పక్కా?
  • ఉత్తరాంధ్ర ఎకనామిక్‌ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పోస్ట్‌..
  • స్మూత్‌గా భూసేకరణ పూర్తి చేయగల లీడర్

Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్రలో ఆయనో పవర్ ఫుల్ లీడర్. ఎమ్మెల్యేగా గెలిచినా, పార్టీ పవర్‌లో ఉన్నా సరే ఆయనకు అత్యంత ఇష్టమైన పదవి మాత్రం దక్కలేదు. బుగ్గకారు యోగం కోసం 18 నెలలుగా ఊగిసలాటలో ఉన్న ఆయనకు ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ దక్కబోతోందట. అత్యంత కీలకమైన పదవి ఆయన తలుపు తట్టబోతోందట. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆయనకు ఇండికేషన్ ఇచ్చారట. ఇంతకు ఎవరా నేత? ఆయన ఆశిస్తున్న పదవేంటి? ఆ లీడర్‌కు దక్కే పోస్ట్ ఏంటి?

మంత్రి పదవి కోసం వెయిటింగ్‌లో ఉన్న మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు..త్వరలోనే గుడ్‌ న్యూస్‌ రాబోతోందట. గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి ఓ రేంజ్‌లో హవా నడిపించిన ఆయన..18నెలలుగా తనకు ఇష్టమైన పదవి దక్కకపోవడంతో అన్ హ్యాపీగా ఉన్నారట. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎదురుచూపులు తప్పడం లేదట. తనకంటే జూనియర్లు, ఒకప్పుడు తాను టికెట్ రికమెండ్ చేస్తే పాలిటిక్స్‌లోకి వచ్చిన వాళ్లు మంత్రి పదవిలో ఉంటే..తాను మాత్రం ఓ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చిందనే అసహనంలో ఉన్నారట. అయితే గంటాకు లక్కీ ఛాన్స్ దక్కబోతోందట.

దాదాపుగా మంత్రి పదవి స్థాయి కలిగిన పోస్ట్..!

ఆయను అదృష్టం వరించబోతోందని..మంత్రి పదవి కాకపోయినా సరే, దాదాపుగా అదే స్థాయి కలిగిన పదవి దక్కబోతోందని తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటా పదవి అంటే ఉత్తరాంధ్ర ఎకనామిక్‌ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పోస్ట్‌. ఈ పదవిని సీఎం చంద్రబాబు గంటాకు కట్టబెట్టబోతున్నారని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ మధ్యే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు, పెట్టుబడులు తేవడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వం టాస్క్‌గా పెట్టుకుంది.

ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి 9 జిల్లాలు వస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పాడేరు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం వరకు విస్తరించారు. 9 జిల్లాల పరిధిలో ఎకనామికి రీజియన్ అథారిటీ చైర్మన్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్‌లో భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, రైడన్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్లతో పాటుగా, దిగ్గజ ఐటీ కంపెనీలు, ప్రఖ్యాత స్టార్ హోటల్స్, ఏరో స్పేస్ ప్రాజెక్టులు, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు, ఎంఎస్ఎంఈ పార్కులు వంటివి వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

అంత సమర్థత ఉన్న నేతగా గంటాకు గుర్తింపు..!

ఈ పరిశ్రమలకు అవసరమైన ప్రభుత్వ భూమి చాలా ఉన్నప్పటికీ, ఇంకా రైతుల నుంచి సేకరణ చేయాల్సి వస్తోంది. ఈ ప్రాసెస్‌ను కూల్‌గా డీల్‌ చేయడం ప్రభుత్వానికి ఛాలెంజ్‌గా మారింది. చాలా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు విపక్ష వైసీపీ ఆధీనంలో ఉండటంతో గ్రామసభల తీర్మానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పనికి స్థానికంగా చాకచక్యంగా పావులు కదిపి..సమస్యలు లేకుండా స్మూత్‌గా భూసేకరణ పూర్తి చేయగల లీడర్ కోసం కూటమి సర్కారు చూస్తోంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలో అంత సమర్ధత ఉన్న నేత గంటా శ్రీనివాసరావు మాత్రమేనని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారట. అందుకే ఆయనకు లోపాయికారీగా ఈ వ్యవహారాలు అప్పగించారట.

గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం భీమిలిలో..డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఏరో స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఇన్ ఫ్రా ప్రాజెక్టుల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. వీటి కోసం కొన్ని వేల ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే గూగుల్, అదానీ డేటా సెంటర్ కోసం భీమిలిలో 200 ఎకరాల వరకు ప్రభుత్వం భూమిని కేటాయించగా, రైతుల నుంచి భూమి సేకరించాల్సి వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు..ఎమ్మెల్యే గంటాతో మాట్లాడి..భీమిలిలో ల్యాండ్ అక్వైజేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారట. అంతేకాదు ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ అథారిటీ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. దీంతో గంటా తన నియోజకవర్గంలో వైసీపీ వర్గానికి చెందిన నేతలు, రైతలను కూడా ఒప్పించి ప్రభుత్వానికి భూమి అప్పగించేలా చేయడంలో చక్రం తిప్పుతున్నారట.

విశాఖ, అనకాపల్లి జిల్లావ్యాప్తంగా గంటాకు పెద్దఎత్తున అనుచరగణం..

కేవలం భీమిలిలోనే కాదు, విశాఖ, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా గంటాకు పెద్దఎత్తున అనుచరగణం ఉండటంతో ఆయా ప్రాంతాల సమీకరణల బాధ్యతలు కూడా అప్పగించారంటున్నారు. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్‌ పరిధిని హ్యాండిల్ చేయాలని గంటాకు ఇండైరెక్ట్‌గా బాధ్యతలు అప్పగించినట్లు టాక్. దీంతో గంటా తనదైన శైలిలో చక్రం తిప్పుతూ తన సత్తా ఏటో చంద్రబాబు, లోకేశ్‌లకు చూపుతున్నారట. వచ్చే మార్చిలో గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ చేయడానికి వీలుగా గంటా అడ్డంకులు తొలగించడంతో ఇటు గంటా, అటు టీడీపీ అధిష్టానం ఫుల్ హ్యాపీ అంటున్నారు. తన స్థాయికి తగ్గ సరైన పదవి లేకపోయిందని అసంతృప్తిలో ఉన్న గంటాకు మంత్రిగా మాత్రమే పరిమితం కాకుండా, ఏకంగా 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతోనూ సమీక్షలు చేయగల లక్కీ పోస్టు వచ్చినట్లేనని విశాఖ రాజకీయవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. అయితే గంటా కల నెరవేరడానికి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.

Also Read: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?