AP Local Body Elections: ఈ గట్టున లోకల్ ఫైట్ పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. ఆ గట్టున స్థానిక సమరం ఊరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడ్డ లోకల్ బాడీ ఎన్నికలు..రెడీ టు ఫైట్‌గా మారాయి. ఇక ఏపీలోనూ స్థానిక ఎన్నికల న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. స్టేట్ ఈసీ రివ్యూస్ లోకల్ బాడీ పోల్స్‌పై అప్డేట్స్ కమింగ్ అప్ అన్నట్లుగా మార్చేస్తున్నాయ్. ఈసీ ఏర్పాట్లు సరే..స్థానిక పోరుకు ఏపీలో పార్టీలు సిద్ధమేనా? ఏపీ లోకల్ ఫైట్‌కు వైసీసీ దగ్గరున్న అస్త్రాలేంటి.? పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై కూటమి ప్లాన్స్ ఏంటి?
బిగ్ ఫైట్ అయిపోయి అప్పుడే 18 నెలలు అవుతోంది. నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు ఇప్పుడొచ్చే లోకల్ బాడీ పోల్సే కీలకం. అందుకే స్థానిక పోరుపై ఇప్పటి నుంచే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. లోకల్ బాడీస్ గడువు కూడా దగ్గర పడుతోంది. దీంతో స్థానిక ఎన్నికలు పెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోందట. న్యూఇయర్ స్టార్టింగ్‌లోనే పంచాయతీ ఎలక్షన్స్‌కు వెళ్లేందుకు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రెడీ చేసుకుంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.
ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగుస్తుంది. 2026 మార్చిలో..కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టంలో ఉంది. దాంతో జనవరిలోనే ఎన్నికలకు వెళ్లే ఎలా బాగుంటుందని భావిస్తోందట కూటమి సర్కార్.
అందుకు తగ్గట్లుగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అరేంజ్‌మెంట్స్‌ను స్పీడప్ చేసింది. ఒకవేళ అప్పటిలోగా కులగణన పూర్తి కాకపోతే మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక మొదట పంచాయతీలకు..ఆ తర్వాత కొంత సమయం తీసుకుని మున్సిపాలిటీలు, ఆ వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఏపీ రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రామాల్లో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది.
అధికార ధీమాతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు లోకల్ ఫైట్‌కు సై అంటున్నారు. విపక్ష వైసీపీలో మాత్రం డైలమాలో కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ లీడర్లు ఎవరూ స్థానిక ఎన్నికలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీస్‌లో 99 శాతం స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అప్పట్లో అధికారం అండతో మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అయ్యేలా ఆ పార్టీ నేతలు చక్రం తిప్పారన్న చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో లీడర్లు, కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. గతంలో ఉన్నంత యాక్టీవ్‌గా కనిపించడం లేదు.
గతంలో ఏకపక్ష విజయాలను సాధించిన వైసీపీ..ఇప్పుడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు లేరు. ఒకవేళ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నా..పెద్దగా యాక్టీవ్‌గా పనిచేయడం లేదు. పైగా రాష్ట్రస్థాయిలో కూడా వైసీపీ స్థానిక ఎన్నికలపై ఎలాంటి ముందస్తు సన్నాహాలు మొదలుపెట్టినట్లు కనిపించడం లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమికి..పవర్ కోల్పోయి విపక్షంలో ఉన్న వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద పరీక్షగా మారబోతున్నాయి.
అయితే జనరల్ ఎలక్షన్స్‌లో ఓడి..జగన్ సొంత ఇలాకాలో రెండు జడ్పీటీసీ సీట్లను కోల్పోయిన వైసీపీ..లోకల్ పోరుపై ఎటూ తేల్చుకోలేకపోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పోటీ చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటోందట ఫ్యాన్ పార్టీ. లోకల్ లీడర్లు మాత్రం పార్టీ అండగా ఉంటేనే తాము ఎన్నికల బరిలోకి దిగుతామని అంటున్నారట. పార్టీ భరోసా ఇవ్వాలంటే నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు యాక్టీవ్‌గా పనిచేస్తే స్థానిక నేతలకు ధైర్యం ఉంటుంది. కానీ వైసీపీలో చాలా చోట్ల ఇంచార్జ్‌లు, లీడర్లు చురుకుగా పనిచేయడం లేదు.
లోకల్ బాడీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకునే నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పులు చేర్పులు చేస్తున్నారట జగన్. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలను పిలిచి క్లాస్ తీసుకున్న జగన్..యాక్టీవ్‌గా పని చేయకుంటే ఆల్టర్నేట్ చేసుకుంటానని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికలకు దృష్టిలో పెట్టుకునే వైసీపీ అధినేత లీడర్లకు దిశానిర్దేశం చేసినట్లు టాక్ నడుస్తోంది.
అధికారంలో ఉన్న కూటమి మాత్రం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన టైమ్ అని లెక్కలు వేసుకుంటోందట. ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇంకా మూడేళ్లు ప్రభుత్వం ఉంటుంది. అధికారం కలిసి వస్తుందని..మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చని స్కెచ్ వేస్తోందట. కూటమి పార్టీలు కూడా ఎవరికి వారుగా తమ బలం పెంచుకునేందుకు స్థానిక ఎన్నికలే సరైన ఫ్లాట్‌ఫామ్‌గా భావిస్తున్నాయట. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలపడాలనుకుంటున్న బీజేపీ..జిల్లా కమిటీలను యాక్టీవ్ చేసి..తమకు క్యాడర్, లీడర్లు ఉన్న చోట్ల..టికెట్లు తీసుకొని గెలిచి తీరాలని ప్లాన్ చేస్తోందట.
అటు జనసేన కూడా గోదావరి జిల్లాలతో పాటు..రాయలసీమ జిల్లాల్లో సీరియస్ కాన్సన్‌ట్రేషన్ చేస్తోందట. టీడీపీ ఓవరాల్‌గా రాష్ట్రంలో అన్ని జడ్పీ ఛైర్మన్ స్థానాలు, మున్సిపల్ పీఠాలు, మేయర్ పదవులు స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోందట. ఏపీ స్థానిక సమరం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా? ఒకవేళ లోకల్ బాడీ పోల్స్ వస్తే పార్టీల స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి.
Also Read: ఆ కోణంలోనే తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ జరుగుతోంది: సజ్జల