Tirumala Laddu Ghee Row Representative Image (Image Credit To Original Source)
Tirumala Laddu Row: ఘీ చుట్టూ ఏపీ రాజకీయం గిరాగిరా తిరుగుతోంది. ఏడాదిగా కల్తీ నెయ్యి హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది. స్టేట్ సిట్ దర్యాప్తు అయిపోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన నెయ్యి ఎపిసోడ్‌లో..స్పెషల్ సిట్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. ఆ ప్రత్యేక దర్యాప్తు టీమ్ అత్యున్నత న్యాయస్థానానికి రిపోర్ట్‌ను కూడా సబ్‌మిట్ చేసింది. అప్పటినుంచే కొత్త లొల్లి స్టార్ట్ అయ్యింది. అసలు వాస్తవాలేంటో తేల్చేందుకు కూటమి సర్కార్ ఏకసభ్య కమిషన్‌ను వేసింది. మండలిలో సభ కోసం వైసీసీ పట్టుబడుతుంటే..అసెంబ్లీ చర్చకు టైమ్ కేటాయిస్తూ ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చేసింది. కల్తీ నెయ్యి ఇష్యూ క్లైమాక్స్‌కు చేరేదెప్పుడు? ఎన్నాళ్లీ రచ్చ? ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతోంది?
ఏడాదికి పైగా అదే రచ్చ. తిరుమల శ్రీవారి లడ్డూ చుట్టే రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రతీసారి క్లైమాక్స్‌లో ట్విస్ట్ లెవల్‌లో..ఎప్పుడూ ఏదో ఒకట ఇష్యూ తెరమీదకు రావడం కల్తీ నెయ్యి రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. నెయ్యిలో..జంతువుల ఫ్యాట్స్ అంటూ..లోకల్ టు నేషనల్ టాపిక్ అయి పెద్ద ఇష్యూ అవుతోంది. కల్తీ నెయ్యి మ్యాటర్ పెద్ద కాంట్రవర్సీ టాపిక్‌గా కంటిన్యూ అవుతూనే ఉంది. కట్ చేస్తే లేటెస్ట్‌గా సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ సిట్ ఇచ్చిన రిపోర్ట్‌తో ఇప్పుడు కొత్త రచ్చ స్టార్ట్ అయింది.
కల్తీ నెయ్యి ఇష్యూలో చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కార్నర్ చేస్తూ వస్తోంది ఫ్యాన్ పార్టీ. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు దారితీస్తోంది. నిజానిజాలు పూర్తిస్థాయిలో తేల్చేందుకు విచారణ కమిషన్‌ను వేసింది కూటమి సర్కార్. కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు సూత్రధారులెవరో తేల్చాలనేదే ప్రభుత్వం టార్గెట్ అంటున్నారు. సిట్ విస్మరించిన అంశాలను బయటికి తీసేందుకే విచారణ కమిషన్‌ను వేశామని చెబుతున్నారు. అయితే ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కోర్టుకెళ్లారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి. ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఎన్నో డౌట్స్..మరెన్నో కన్‌ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతున్న వేళ..కల్తీ నెయ్యిపై విచారణ కమిషన్ వేయడం..సేమ్‌టైమ్ అసెంబ్లీలో చర్చకు పెడుతుండటం ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో కల్తీ నెయ్యి ఇష్యూ మళ్లీ కాక రేపుతోంది. మండలిలో చర్చ పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే..అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు సిద్ధమైంది సర్కార్. నెయ్యి కల్తీపై శాసనసభలో నాలుగు గంటలు చర్చించనున్నారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్‌ను రద్దు చేసి మరీ చర్చకు టైమ్ కేటాయిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది MLAలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.
మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మాట్లాడతారని షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ నిబంధనలు ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. అమృతసర్ స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానంకు కూడా చట్టం తీసుకురావాలని భావిస్తోందట ప్రభుత్వం.
ఏడాదిగా కల్తీ నెయ్యి చుట్టూ పెద్ద రచ్చే నడుస్తోంది. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు కొన్ని వందల మందిని సిట్ విచారించింది. అయితే సిట్ తెలిపిన వివరాల్లో స్పష్టత లేదని కూటమి సర్కార్ ఏకసభ్య కమిషన్‌ను వేసి కల్తీ కథను క్లైమాక్స్‌కు చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు కల్తీ నెయ్యి ఇష్యూపై పొలిటికల్ ఫైట్ నడుస్తుండగా..ఇంకోవైపు కోర్టుల్లో పిటిషన్లు దర్యాప్తులు కంటిన్యూ అవుతుండగా..మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
తిరుమల శ్రీవారి ఆలయం, భక్తుల అవసరాల కోసం సరఫరా అయ్యే నెయ్యి క్వాలిటీని టెస్ట్ చేసేలా ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాలు సమకూరుస్తోంది. రూ.3.5 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. నెయ్యి నాణ్యతలో చిన్నపాటి లోపమున్నా సరే ఇవి ఇట్టే గుర్తిస్తాయని అంటున్నారు. దాదాపు రూ. 25 కోట్లతో తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో ఈ యంత్రాలను నెలకొల్పబోతున్నారు. ఈ-టంగ్, ఈ-నోస్ మిషిన్లు ఈ ఏడాది మే నెల నాటికి వస్తాయని..నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి దాదాపు 60 రకాల ముడి సరుకులు, ప్రసాదాల క్వాలిటీని ఎప్పటికప్పడు టెస్ట్ చేయనునున్నారు. ఈ ల్యాబ్‌లో టీటీడీ జలప్రసాదాల నమూనాలను కూడా పరీక్షిస్తారు.
విచారణ కమిషన్ ఏర్పాటు..అసెంబ్లీలో చర్చ అంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనతో..టీటీడీ కల్తీ నెయ్యి ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్..కల్తీ నెయ్యి, జంతవుల ఫ్యాట్స్ అంటూ ప్రకటనలు చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడంలో అప్పుడు టీడీపీలో ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్న నేతలు..అప్పటి ఈవోలు..అప్పటి ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్‌మెంట్ ఉండి ఉండొచ్చన్నది కూటమి లీడర్ల ఆరోపణ.
స్పెషల్ సిట్ ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేవలం డెయిరీలపైనే ఫోకస్ పెట్టిందని..కానీ అసలు చక్రం తిప్పిన వాళ్లెవరో తేల్చలేదంటున్నారు. సిట్ పాత్రధారులను అరెస్టు చేసి సూత్రధారులను వదిలేసిందని..ఏకసభ్య కమిషన్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఈ విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మళ్లీ డైలాగ్ వార్ పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. పరిస్థితులను బట్టి చూస్తే కల్తీ నెయ్యి ఇష్యూ..రెగ్యులర్ ఎపిసోడ్‌గా నడిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కల్తీ నెయ్యి అంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.
Also Read: ఇక చేపలు, చికెన్‌పైనా.. సిగరెట్ లాంటి ఆరోగ్య హెచ్చరికలు..? చర్చకు దారితీసిన మంత్రి వ్యాఖ్యలు