Gossip Garage: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దారెటు? వైసీపీకి రాజీనామా చేసిన ఆయన సైలెంట్ గా ఉండడం వెనుక ఉన్న కారణాలేంటి? ఇంతకీ గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారంటూ భీమవరంలో ఆసక్తికరంగా చర్చ జరుగుతుందట. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన గ్రంథి అడుగులు కూటమివైపే అన్చ చర్చ సైతం జిల్లా రాజకీయాల్లో నడుస్తోందట. అంతేకాదు…వచ్చే మే నెలలో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నరన్న టాక్ సైతం ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. ఇంతకీ గ్రంథి శ్రీనివాస్ మౌనం వెనకున్న పరమార్థమేంటో?
గ్రంథి రాజకీయ భవిష్యత్ పై రకరకాల చర్చలు..
వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సైలెన్స్ మెయింటేన్ చేస్తున్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరబోతున్నారంటూ ఏపీ పాలిటిక్స్ లో తెగ చర్చనడుస్తోంది. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన సైలెన్స్ వెనకున్న అర్థమేంటో అర్థంకాక భీమవరం లీడర్స్ అయోమయంలో పడుతున్నారంట.
బీజేపీలో చేరితే బాగుంటుందని సూచనలు..
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన పరిచయాలతో తిరిగి మళ్లీ జనసేనలో చేరే అవకాశం ఉందంటూ ఆయన అనుచరులు భావిస్తున్నారట. అయితే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరితే బాగుంటుందని మరికొంతమంది ఆయనకు సూచనలు చేస్తున్నారంట.
Also Read : ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆ మాజీమంత్రి ప్లాన్? సిట్టింగ్ ఎమ్మెల్యేపై కుట్రలు? ఎవరా నేత, ఎందుకిలా..
ఒకవేళ టీడీపీలో చేరినా పోటీ ఎక్కువగా ఉండటంతో జనసేన లేదా బీజేపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారని తెలుస్తుంది. అనుచరుల ఆలోచనలు ఇలా ఉంటే..గ్రంథి శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతం ఎటు తేల్చుకోలేక తటస్థంగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం.
కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో ఇటీవల గ్రంథి ప్రధాన అనుచరులు భేటీ అయ్యారట. త్వరలోనే ఆయన కూడా కేంద్ర మంత్రితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన ముఖ్య నేతలతో కూడా విస్తృత పరిచయాలు ఉండటంతో జనసేనలో చేరే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తున్న మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే దానిపై సమాలోచనలు చేస్తూనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారంట. భీమవరం సమగ్రాభివృద్ది కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేలా కార్యచరణ రూపొందించుకుంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు.
భీమవరం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు గ్రంధి శ్రీనివాస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాలనుకున్నా టికెట్ దక్కలేదు. దాంతో ఆయన 2011లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం ఆయన గెలిచి సత్తా చాటినా 2024లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఓటమిని చవిచూశారు.
మే నెలలో నిర్ణయం ప్రకటించే అవకాశం..?
Also Read : ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది ఈ నెలలోనే.. డేట్ చెప్పేసిన మంత్రి
2024 ఎన్నికల్లో ఓటమి తరువాత కొన్నాళ్ళ పాటు మౌనంగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే ఆయన టీడీపీలోకో లేక జనసేనలోకో వెళ్తారని అంతా భావించినా అవేమీ జరగలేదు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది వచ్చే నెలలో ఓ కీలక ప్రకటన చేస్తారంటూ జిల్లా రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందన్నది గ్రంధి ఆలోచించుకునే సరైన నిర్ణయం తీసుకొని మే నెలలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వర్గం అంటోంది. దీంతో గ్రంథి ఏ పార్టీలో చేరతారనేది మేలో ఓ క్లారిటీ వస్తుందని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here