Gudivada Amarnath : పవన్ కళ్యాణ్ కనిపిస్తే.. ఎక్కడ తాళి కట్టేస్తారేమోనని ఆడపిల్లలు భయపడుతున్నారు : మంత్రి గుడివాడ అమర్ నాథ్

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఖండిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కలిసి తిరగవచ్చు కదా అని ప్రశ్నించారు.

Amarnath Comments Pawan

Gudivada Comments Pawan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఎంజాయ్ స్టార్.. ఆంధ్రలో గంజాయి స్టార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థను కించ పరిచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు ఎక్కడ అమ్మాయిలు ఉన్నారో ఆ సమాచారం ఇస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

ఈ మేరకు సోమవారం మంత్రి గుడివాడ విశాఖలో మీడియాతో మాట్లాడారు. గ్రామ వార్డ్ సచివాలయ వాలంటీర్లు ఏమైనా ఆపద వస్తే కాపాడతారు అనే భరోసాలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు భయపడితే, పవన్ కళ్యాణ్ కి భయపడుతున్నారని పేర్కొన్నారు.

JC Diwakar Reddy : ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

ఎక్కడ కనిపిస్తే తాళి కట్టేస్తారేమో అని భయపడుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ నేరుగా జనసేనాని కాదు, చంద్రబాబు సేనాని అని చెప్తున్నారని పేర్కొన్నారు. జనసేనను టీడీపీలో కలిపి వేయచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చారు. వెబ్ సిరీస్ లా వారాహి యాత్ర నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఖండిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కలిసి తిరగవచ్చు కదా అని ప్రశ్నించారు. వారు అధికారంలోకి వస్తే పథకాలు తీసేస్తాం, వాలంటిర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పవచ్చు కదా అని నిలదీశారు.