Gudivada Casino Issue Tdp Fact Finding Committee To Tour In Gudivada On Casino Issue Today
TDP Gudivada Tour : ‘గుడివాడ క్యాసినో’ వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బృందం నేడు (శుక్రవారం) కృష్ణా జిల్లాలోని గుడివాడలో పర్యటించనుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గుడివాడకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బృందం బయల్దేరనుంది. గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీ బృందం గుడివాడలోని క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించనుంది. అక్కడి పూర్తి స్థాయి వివరాలను సేకరించి టీడీపీ అధిష్టానికి కమిటీ బృందం అందించనుంది. టీడీపీ నేతల గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ మహానీయులు పుట్టిన గడ్డపై గోవా కల్చర్ ఏంటి అని టీడీపీ మండిపడుతోంది. టీడీపీ నేతల గుడివాడ పర్యటన నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల సమస్యలు వస్తాయోనని పోలీసుల్లో టెన్షన్‌లో మొదలైంది.
మరోవైపు.. గుడివాడ క్యాసినో వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కృష్ణా పోలీసులు రంగంలోకి దిగారు. సంక్రాంతి 4 రోజులు ఏం జరిగింది అనేదానిపై విచారణ కొనసాగుతోంది. గోవా నుంచి క్యాసీనో టీమ్‌ను రప్పించింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలను మించి గుడివాడ క్యాసినో పేరు ఏపీలో మారుమోగింది. గోవా, శ్రీలంకల్ని మించిన స్థాయిలో క్యాసినో ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరిగింది.
గుడివాడలో కే కన్వెన్షన్ సెంటర్ లో కోడిపందాలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారని… రూ. 10వేలు చెల్లిస్తేనే క్యాసినో లోకి నిర్వాహకులు అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సందర్భంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also : AP PRC Protest : పీఆర్సీపై ఉద్యోగ సంఘాల ఐక్య పోరాటం.. ప్రభుత్వ వైఖరిని బట్టి కార్యాచరణ..!