Ramya Murder: మీడియా ముందుకు బీటెక్ విద్యార్థిని హత్యా నిందితుడు

శనివారం కాకాని రోడ్డులో బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని యువకుడు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ముద్దాయ

Ramya Murder: శనివారం కాకాని రోడ్డులో బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని యువకుడు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ముద్దాయిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై మాట్లాడిన డీఐజీ రాజశేఖర్ నిందితుడి గురించి, కేసు గురించి వివరాలు వెల్లడించారు. ముద్దాయి శశికృష్ణ 9వ తరగతి వరకు చదువుకోగా గతంలో మెకానిక్ గా పనిచేశాడని చెప్పారు.

Ramya Murder

సోషల్ మీడియాలో హీరోలా బిల్డప్ ఇచ్చే శశికృష్ణ ఇన్ స్టాగ్రామ్ ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడు. రమ్యతో పరిచయం పెంచుకుని.. ప్రేమించమని వెంటపడి వేధించేవాడని తెలిపిన డీఐజీ రమ్య హత్యకు గురి కావడం దురదృష్టకరమైన విషయమన్నారు. హత్య జరిగిన కొన్ని గంటలలో ముద్దాయిని అరెస్ట్ చేశామని.. నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తామని డీఐజీ హామీ ఇచ్చారు.

సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తులతో మహిళలు అప్రమత్తంగా వుండాలని.. విద్యార్థులు, బాలికలు, యువతులే కాదు సోషల్ మీడియాపై తల్లిదండ్రులకు కూడా అవగాహన వుండాలని కోరారు. తమ పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ మహిళా రక్షణకు కట్టుబడి ఉంటుందన్న డీఐజీ అవసరమైతే సోషల్ మీడియాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పరిశీలిస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు