గుంటూరు కూరగాయల మార్కెట్ లో ఉద్రిక్తత, వ్యాపారి ఆత్మహత్యాయత్నం

  • Publish Date - October 12, 2020 / 03:53 PM IST

guntur market: గుంటూరు జిల్లా పివికె నాయుడు కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. కూరగాయలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ వ్యాపారుల ఆందోళనకు దిగారు. అనుమతి ఇవ్వాల్సిందేనంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే కోవిడ్‌ రూల్‌ ప్రకారం కూరగాయల విక్రయానికి అనుమతి ఇవ్వలేమని.. మార్కెట్‌ను ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో ఓ వ్యాపారి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడ్ని తోటి వ్యాపారులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మార్కెట్‌లో భారీగా మోహరించారు పోలీసులు.