Ap Rains: ఏపీలో మరొకొన్ని గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. అప్రమత్తమైన విపత్తు నిర్వహణ సంస్థ

ఆంధ్రప్రదేశ్(Ap Rains) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

Heavy rain accompanied thunder and lightning several districts in andhra pradesh

Ap Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వాతావరణ మార్పుల నేపథ్యంలో పల్నాడు జిల్లాకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. అలాగే పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Kethireddy Pedda Reddy: దమ్ముంటే నన్ను ఎదుర్కో.. జేసీకి కేతిరెడ్డి సవాల్.. హీటెక్కిన అనంతపురం పాలిటిక్స్

మరోవైపు, ఇప్పటికే విజయవాడ నగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Ap Rains)ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కోరారు. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు.