TTD : భారీ వర్షాలు.. దర్శనానికి రానివారికి మరో రోజు అవకాశం
తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది.
- kunduru Vinod
- Updated on- November 19, 2021 / 07:25 AM IST
Ttd (2)
TTD : తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. ఇక దర్శనానికి వెళ్లేవారు కూడా తీర్వ ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చదవండి : TTD Accommodation : తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు
అయితే వారికి అన్ని విధాల సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. వర్షాలతో తిరుపతిలో చిక్కుపోయిన భక్తులకు వసతి ఏర్పాట్లు చేసింది. శ్రీనివాసం, మాధవరం, రెండు, మూడు సత్రాల్లో వసతి ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా 18,19,20 తేదీల్లో దర్శన టికెట్లు ఉంది దర్శనానికి రాలేకపోయిన వారికి కొద్దీ రోజుల తర్వాత రోజులలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.
చదవండి : TTD : శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎస్
