TTD : శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎస్

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

TTD : శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎస్

Ttd

Tirumala : తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో తిరుమల పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక పౌర్ణమికి భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రముఖులు సైతం శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు. 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరిలో కొంతమంది శ్రీవారిని దర్శించుకున్నారు. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు దర్శించుకున్న వారిలో ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

Read More : Kuppam: కుప్పంలో దొంగ ఓట్లు.. పట్టుకున్న పోలీసులు

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యలు చర్చకు వచ్చాయని, అందులో ప్రధానంగా జలవివాదం, ఏపీలో విభజన సమస్యలు చర్చించామన్నారు. ఇరు రాష్ట్రాలు, కేంద్రం కలిసి వీటికి పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ములుగు ట్రైబల్ యునివర్సిటీ నిర్మాణానికి పరిష్కారం లభించిందన్నారు. మరోవైపు…శ్రీ వారిని దర్శించుకున్న వారిలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకూడా ఉన్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రాల మధ్య సఖ్యతకు సమస్యల పరిష్కారానికి ఎంతగానో దోహదపడిందన్నారు. అమిత్ షా ఆధ్వర్యంలో కర్ణాటక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నో అంతర్గత విషయాలు చర్చించినట్లు వెల్లడించారు. చాలా సమస్యలకు పరిష్కారాలు లభించాయన్నారు. కర్ణాటక జల విద్యుత్ కు సంబంధించి మంత్రాలయం జలశక్తి శాఖ ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రం సుభిక్షంగా, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తాను శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.