రాజధానిపై జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. మూడు రాజధానులు, సాంకేతిక అంశాలపై
రాజధానిపై జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. మూడు రాజధానులు, సాంకేతిక అంశాలపై హైపవర్ కమిటీ సమీక్షించనుంది. ఓవైపు రైతుల ధర్నాలు, మరోవైపు సీఎం జగన్ వికేంద్రీకరణ ప్రతిపాదనల నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏం చేయబోతోందన్నది ఆసక్తిగా మారింది.
ఏపీ రాజధాని అంశంపై హైపవర్ కమిటీ ఇవాళ(జనవరి 07,2020) సమావేశమవుతోంది. రాజధానికి సంబంధించి ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. బోస్టన్ గ్రూప్ కూడా తన టెక్నికల్ నివేదిక సమర్పించింది. ఈ రెండు నివేదికలపై చర్చించి ఓ తుది నివేదికను తయారుచేసే బాధ్యతను హై-పవర్ కమిటీకి అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. ఆర్థిక మంత్రి బుగ్గన, రవాణా మంత్రి పేర్ని నాని, హోం మంత్రి సుచరితతో పాటు మొత్తం 10 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. వీళ్లతో పాటు ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిపి మొత్తం 16 మంది సభ్యులతో ఈ హైపవర్ కమిటీ ఏర్పాటైంది.
ఇవాళ అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ కమిటీ 20వ తేదీలోగా తన తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్‌కు సమర్పిస్తుంది. అవసరమైతే తన తుది నివేదిక కోసం ఈ హై-పవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు కూడా తీసుకోవచ్చు. తర్వాత దానిపై కేబినెట్ లో చర్చించి రాజధాని అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారు.
జీఎన్ రావు కమిటీ మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని స్పష్టంగా చెప్పేసింది. కావాలంటే హైకోర్టు బెంచ్‌లను విశాఖ, అమరావతిలో పెడితే సరిపోతుందని సూచించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విధంగా జీఎన్ రావు కమిటీ కూడా నివేదికను ఇచ్చింది. ఇక బోస్టన్ గ్రూప్ కూడా దాదాపుగా అదే రిపోర్ట్ ఇస్తూ రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఆప్షన్-1 ప్రకారం విశాఖలో సెక్రటేరియెట్, సీఎం ఆఫీస్, గవర్నర్ ఆఫీస్, హైకోర్ట్ బెంచ్, అత్యవసర అసెంబ్లీ, ప్రభుత్వ శాఖల HODలు ఉండాలని సూచించింది. అలాగే అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కొన్ని శాఖల కార్యాలయాలు ఉండాలని చెప్పింది. కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు ఉండాలని చెప్పింది.
ఇక ఆప్షన్-2 ప్రకారం విశాఖలో సెక్రటేరియెట్, సీఎం ఆఫీస్, గవర్నర్ ఆఫీస్, అన్ని శాఖల కార్యాలయాలు ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు నెలకొల్పాలని సూచించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ విశ్లేషించనుంది. సమీక్ష తరువాత ఫైనల్ రిపోర్టును సీఎం జగన్‌కు సమర్పించనుంది.
* ఏపీ రాజధాని ఎక్కడ..?
* హైపవర్ కమిటీ తొలి సమావేశం
* తుది నివేదిక ఇవ్వనున్న హైపవర్ కమిటీ
* కమిటీలో 10 మంది మంత్రులు
* ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్‌లతో కలిపి 16 మంది
* 20వ తేదీలోగా తుది నివేదిక
* అవసరమైతే అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు
* విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచ్‌ను సూచించిన జీఎన్‌రావు
* రెండు ఆప్షన్స్ ఇచ్చిన బోస్టన్ గ్రూప్
ఆప్షన్-1
విశాఖలో సెక్రటేరియెట్, సీఎం ఆఫీస్, గవర్నర్ ఆఫీస్
హైకోర్ట్ బెంచ్, అత్యవసర అసెంబ్లీ, ప్రభుత్వ శాఖాధిపతులు
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కొన్ని శాఖల కార్యాలయాలు
కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు
ఆప్షన్-2
విశాఖలో సెక్రటేరియెట్, సీఎం ఆఫీస్
గవర్నర్ ఆఫీస్, అన్ని శాఖల కార్యాలయాలు
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్
కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు
Also Read : అమ్మఒడి : 300 యూనిట్లకు పైబడి ఉంటే పథకం వర్తించదు