Gorantla Madhav Video Call : ఏపీలో పొటిలికల్ హీట్ పెంచిన వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో

న్యూడ్ వీడియో విషయంలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వేటు తప్పదా? ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోందా? అదే జరిగితే కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తారా? ఇప్పుడిదే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.

Gorantla Madhav Video Call : న్యూడ్ వీడియో విషయంలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వేటు తప్పదా? ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోందా? అదే జరిగితే కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తారా? ఇప్పుడిదే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పొలిటికల్ హీట్ పెంచేసింది. గోరంట్ల మాధవ్ ఓ మహిళతో ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఫేస్ బుక్ మెసెంజర్ లో తొలుత ఈ వీడియో వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కాసేపటికే ట్విట్టర్ లోనూ కొంతమంది షేర్ చేశారు. ఆ తర్వాత నెట్టింట్లో వైరల్ గా మారింది. దాంతో ఎంపీ మాధవ్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఏపీ పరువు తీశారని మండిపడ్డారు. ఆయన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మాధవ్ పై విమర్శల వర్షం కురిపించారు.

MP Gorantla Madhav Video Call : వీడియో ఒరిజినల్ అని తేలితే.. గోరంట్ల మాధవ్‌పై చర్యలు-సజ్జల

మరోవైపు ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ కొట్టిపారేశారు. టీడీపీ నేతలు మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే నగ్న వీడియో కొందరు కుట్ర చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో వెనుక అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఉన్నాడని ఆరోపించారు మాధవ్. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానన్నారు.

ఎంపీ మాధవ్ ఆరోపణలపై చింతకాయల విజయ్ స్పందించారు. తనపై మాధవ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆయన పర్సనల్ వీడియోలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైసీపీ నాయకత్వం కూడా సీరియస్ అయ్యింది. మాధవ్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అది మార్ఫింగ్ వీడియో కాదు ఒరిజినల్ వీడియో అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు