Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ, అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Road Accident
- Naveen
- Published On : July 22, 2023 / 08:18 PM IST
Road Accident
Annamayya Road Accident : రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అతివేగం ప్రాణాంతకం అని తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఘోర ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న ఘోర ప్రమాదాలు కళ్లారా చూస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రాకపోవడం శోచనీయం.
తాజాగా అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లి మండలం చిన్నవరంపాడు వద్ద బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. 20మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మలుపు వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమదానికి కారణం అని తెలుస్తోంది.
