Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి

Train Acciden Srikakulam District : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Train Acciden Srikakulam District

Train Accident Srikakulam : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వారంతా బర్మా ప్రాంతానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు.

Also Read : AP Govt : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా 14 రకాల వస్తువులు పంపిణీ

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకులు బహిర్భూమికి వెళ్తూ ట్రాక్‌ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.