AP Govt : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా 14 రకాల వస్తువులు పంపిణీ
AP Govt Baby Kits : ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Government NTR Baby Kits
AP Govt Baby Kits : ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాతాశిశు ఆరోగ్య సంరక్షణకోసం ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ (NTR) బేబీ కిట్ పథకాన్ని రాష్ట్రంలో మళ్లీ పున:ప్రవేశపెడుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : YS Jagan : వైఎస్ జగన్తో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష భేటీ..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవించే తల్లులకు, నవజాత శిశువులకు ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ ను ఉచితంగా ప్రభుత్వం అందజేయనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ కిట్ల సేకరణ, పంపిణీ బాధ్యతలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విభాగానికి అప్పగించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతల వివరాలను సేకరించి ఈ కిట్లను పంపిణీ చేస్తారు.
కూటమి ప్రభుత్వం నాణ్యతా ప్రమాదాణాలతో రూపొందించిన ఒక్కో ఎన్టీఆర్ బేబీ కిట్ మార్కెట్ విలువ సుమారు రూ.1,410గా నిర్ధారించారు. ఈ బేబీ కిట్లపై ఏడాదికి రూ.51.2 కోట్లను ఏపీ వైద్యఆరోగ్య శాఖ ఖర్చు పెట్టనుంది. ఈ కిట్లో 14రకాల వస్తువులను అమర్చారు.
బేబీ కిట్లో వస్తువులు ఇవే..
సుభద్రత శిశువు దుస్తులు, డైపర్లు, ముట్టు/తువాలు, బేబీ జ్లాంవెల్, బేబీ సబ్బు, బేబీ షాంపూ, మసాజ్ ఆయిల్, డైపర్ ర్యాషీ క్రీమ్, ధర్మామీటర్, బేబీ హెయిర్ బ్రష్/కామ్, ఫీడింగ్ బాటల్, బేబీ ఫీడింగ్ నిపుల్, హ్యాండ్ సానిటైజర్/క్రీస్జల్, వెట్ వైప్స్
