Visakhapatnam : విశాఖపట్టణంలో దారుణం.. దంపతుల ప్రాణాలు తీసిన బిర్యానీ.. నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే ఘోరం..

Visakhapatnam : విశాఖపట్టణంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీ కోసం తలెత్తిన వివాదం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. నాలుగేళ్ల కుమారుడు కళ్లెదుటే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Husband wife commit suicide in Visakhapatnam

  • విశాఖపట్టణంలో విషాద ఘటన
  • బిర్యానీకోసం భార్యాభర్తల మధ్య ఘర్షణ
  • ఉరేసుకొని భార్య మృతి..
  • భయంతో బలవన్మరణానికి పాల్పడిన భర్త
  • నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే ఘటన

Visakhapatnam : విశాఖపట్టణంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీ కోసం తలెత్తిన వివాదం దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. వివాదంతో మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆ తరువాత భయంతో నాలుగేళ్ల కుమారుడు కళ్లెదుటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి విచారించారు. నాలుగేళ్ల కుమారుడిని అడుగగా.. ముందు అమ్మ ఊయల ఊగింది.. తర్వాత నాన్న వచ్చి అమ్మను పడుకోబెట్టాడు.. ఆ తర్వాత నాన్న కూడా ఊయల ఊగాడు అంటూ చెప్పడంచూసి స్థానికులను కంటతడి పెట్టించింది.

Also Read : AP Rains : ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర ఈదురుగాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతానికి చెందిన దిరగాసి బలరాం(33), ప్రియాంక(27) ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. జీవనోపాధికోసం నగరానికి వచ్చి రామాటాకీస్ సమీపంలోని శ్రీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ప్రియాంక తల్లి రాజేశ్వరి కూడా వారితోపాటే ఉంటోంది. బలరాం వెల్డింగ్ పనులకు వెళుతుంటాడు. అతను విదేశాల్లో వెల్డింగ్ పనికి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చాడు. మద్యానికి బానిసై అప్పులు చేస్తూ తరచూ భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే, ఆదివారం రాత్రి వీరి మధ్య బిర్యానీ విషయంపై వివాదం తలెత్తింది.

ఆదివారం సాయంత్రం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన బలరాం.. రాత్రి పది గంటలకు భార్యకు ఫోన్‌చేసి తనకు బిర్యానీ తెచ్చి ఉంచాలని చెప్పాడు. దాంతో వారిద్దరి మధ్య ఫోన్లోనే వాగ్వాదం జరిగింది. వారితోపాటే నివాసం ఉంటున్న ప్రియాంక తల్లి బిర్యానీ కోసం గొడవ ఎందుకులే అని బిర్యానీ తేవడానికి బయటకు వెళ్లింది. ఫోన్లో గొడవతో మనస్తాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కొద్దిసేపటికి ప్రియాంకకు ఫోన్ చేసిన బలరాం… ఆమె బదులివ్వకపోవడంతో ఇంటికి వచ్చాడు. ఆమె ఉరికి వేలాడడం చూసి కిందకుదింపాడు. అప్పటికే ఆమె మృతి చెందడంతో భయపడిన బలరాం.. తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికే బిర్యానీ తీసుకొచ్చిన ప్రియాంక తల్లి రాజేశ్వరి తన కుమార్తె మంచం వద్ద మృతిచెంది ఉండడం, అల్లుడు ఉరేసుకుని చనిపోయి ఉండడం చూసి స్థానికుల సాయంతో ద్వారకా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇక లేరని తెలియక వారికోసం గుక్కపట్టి ఏడుస్తున్న బాలుడిని చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.