Prakasam : అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ ఘటన ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
- kunduru Vinod
- Published On : August 9, 2021 / 10:24 AM IST
Prakasam
Prakasam : వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ ఘటన ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొటికలపూడి నరసింహం, రమణమ్మ (47) భార్యాభర్తలు.
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో నరసింహం రోజు మద్యం తాగి వచ్చి ఆమెపై దాడి చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె గొంతు కోశాడు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుగుపొరుగువారు ఘటన విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.. ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తికావడంతో ఖననం చేశారు. ఇక భర్త నరసింహంను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. కాగా వీరికి నలుగురు కుమారులు. ఇద్దరికి వివాహమవ్వగా మరో ఇద్దరు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తున్నారు.
