Hyderabad To Chennai High Speed Rail : అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైల్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లోనే స్టేషన్లు..
Hyderabad To Chennai High Speed Rail : హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు ఏపీ రాజధాని అమరావతి మీదుగా పరుగులు పెట్టనుంది.ఈ మేరకు తుది లొకేషన్ సర్వే, డీపీఆర్ సిద్ధం చేయడం కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) సిద్ధమైంది.
- Harish Thanniru
- Published on- June 21, 2026 / 07:35 AM IST
Hyderabad To Chennai High Speed Rail
- అమరావతి మీదుగానే హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు
- కొత్త విమానాశ్రయం సమీపం నుంచి ఎలైన్‌మెంట్ ప్రతిపాదన వెనక్కి
- ఏపీలో తొమ్మిది.. తెలంగాణలో ఆరు స్టేషన్లు
Hyderabad To Chennai High Speed Rail : హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ రైలు ఏపీ రాజధాని అమరావతి మీదుగా పరుగులు పెట్టనుంది. అమరావతి మీదుగానే హైస్పీడ్ రైలు కారిడార్ వెళ్లేలా డీపీఆర్ రూపొందించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు తుది లొకేషన్ సర్వే, డీపీఆర్ సిద్ధం చేయడం కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) సిద్ధమైంది.
Also Read : Mudragada Padmanabham : మాజీ మంత్రి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..!
తొలుత అమరావతికి కొద్ది దూరంలో రావెల వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ కు సూచించారు. అయితే.. ఎయిర్ పోర్టుకు ఆనుకొని కారిడార్ ఎలైన్మెంట్ సిద్ధంచేస్తే.. రాజధాని అమరావతికి, విజయవాడకు దూరంగా ఉంటుందని, ఎయిర్ పోర్టు సమీపం నుంచి గుంటూరు వైపు వెళ్లాల్సి వస్తుందని గుర్తించారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి నగరానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అమరావతి మీదుగానే కారిడార్ వెళ్లేలా ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సూచించింది.
హైదరాబాద్-అమరావతి – చెన్నై కారిడార్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 760.09 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 18 స్టేషన్లు నిర్మించనున్నారు. అయితే, ఈ హైస్పీడ్ రైలు ప్రయాణం తెలంగాణ రాష్ట్రం పరిధిలో 180.32 కిలో మీటర్లు ఉంటుంది. ఈ పరిధిలో హైదరాబాద్, శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్టు, హాలియా, వాడపల్లి వద్ద స్టేషన్లు నిర్మించనున్నారు.
ఏపీ రాష్ట్రం పరిధిలో 518.54 కిలోమీటర్లు ఈ హైస్పీడ్ రైలు ప్రయాణించనుండగా.. దాచేపల్లిలో తొలి స్టేషన్ నిర్మాణం అవుతుంది. ఆ తరువాత అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి (విమానాశ్రయం వద్ద) స్టేషన్లు నిర్మించనున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో ఈ హైస్పీడ్ రైలు కారిడార్ 61.23 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉంటుంది. ఇందులో తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్‌రోడ్/మింజూర్, చెన్నె సెంట్రల్ స్టేషన్లు ఉంటాయి.
