ఇంట్లో భార్య శవం : ఇంటిపై నుంచి దూకి భర్త ఆత్మహత్య: ఏం జరిగింది?!

  • Publish Date - July 21, 2020 / 03:42 PM IST

హైదరాబాద్ లో భార్యాభర్తల మృతి తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న భార్యాభర్తల మృతి సంచలనంగా మారింది. భార్య మృతదేహం ఇంటిలోనే ఉంది. ఈ క్రమంలో భర్త అపార్ట్ మెంట్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మృతి పలు అనుమానాలకు దారి తీసింది.

శ్రీకాకుళం నుంచి వచ్చి గత పదేళ్లుగా హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో నివాసముంటున్న నాగేశ్వర రావు రోజా హఠాత్తుగా భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
కాగా..నాగేశ్వర రావు ఆత్మహత్యకు ముందే భార్య రోజాను హత్య చేశాడా? ఇది బైటపడుతుందనే కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు భార్యను నాగేశ్వర రావే హత్య చేశాడా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.