అనంతపురం జిల్లాలో ఇద్దిరికి కరోనా లక్షణాలు?

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.

  • Publish Date - March 13, 2020 / 05:59 AM IST

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గుడిబండ మండలంలో ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు తెలుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కరోనా అనుమానితులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. (ఇద్దరు కేరళ నర్సులకు కరోనా పాజిటివ్!)

కరోనా కలకలం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులను ఆదేశించారు. కియా, పుట్టపర్తి, అనంతపురం ప్రాంతాల్లో విదేశీయుల రాకపోకలను అప్రమత్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అనుమానితులను ఇళ్లకే పరిమితం చేశారు.

జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా జన సమూహాల దగ్గరికి వెళ్లవద్దన్నారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు ధరించాలని కలెక్టర్..అధికారులను ఆదేశించారు.  

ఏపీలో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటు తెలంగాణలో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తుండడంతో శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపారు.  కరోనా వైరస్‌ వ్యాపిస్తుండంతో.. దాని  కట్టడికి రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.