Suspected Boat : శ్రీలంక నుంచి నెల్లూరుకు కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు..చూడటానికి తరలివచ్చిన ప్రజలు

శ్రీలంక నుంచి నెల్లూరు సముద్రతీరానికి కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు చూడటానికి భారీగా తరలి వచ్చారు ప్రజలు.

Suspected Boat In Idols Of Gods At Nellore District Sea

Suspected Boat At Nellore District sea : నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరానికి ఓ పడవ కొట్టుకొచ్చింది. ఆ పడవ ఇప్పుడు స్థానికులకు మిస్టరీగా మారింది. అప్పుడప్పుడు సముద్ర తీరానికి పడవలు కొట్టుకుని వస్తుంటాయి. సముద్ర అలల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు లాక్‌లు తెగిపోయి చిన్న, చిన్న పడవలు తీరాలకు కొట్టుకువస్తుంటాయి. కానీ నెల్లూరు జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవ మాత్రం..మిస్టరీగా మారింది.

ఆ పడవలో కనిపించినవి చూసి.. మత్స్యకారులు మరింత విస్తుపోయారు. నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరానికి వెందురుబొంగులతో తయారు చేసిన ఓ నాటు పడవ కట్టుకొచ్చింది. ఆపడవ వెదురు బొంగులతో నిర్మాణం చేసి ఉండటం..ఓ వింతగా అది కనిపించటంతో మత్స్యకారులకు ఆ పడవపై ఆసక్తి పెరిగింది. అదేంటో చూద్దామని ఆసక్తిగా వెళ్లి చూశారు. ఆ పడవలో దేవుళ్ల విగ్రహాలు కూడా ఉండటంతో మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.

ఈ పడవ లోపల ఎవరన్నా ఉన్నారా? లేదా మరేవైనా ఉన్నాయా? అని ఆసక్తిగా దాన్ని వద్దకు వెళ్లి చూశాడు. ఆ పడవలో బుద్దుడు విగ్రహం, శివలింగం కనిపించటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మెరైన్ పోలీసులకు ఫోన్ చేసి..సమాచారం అందించారు. మత్సకారుల సమాచారంతో ఇస్కపల్లి సముద్ర తీరానికి వచ్చిన మెరైన్ పోలీసులు ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు.

ఆ పడవ శ్రీలంకకు చెందినదనీ మత్స్యకారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలల ఉధృతి ఎక్కువై.. పడవ ఇలా తీరానికి కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పడవ విషయం చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు తెలియడంతో అక్కడికి వచ్చి ఈ కొత్తరకం పడవను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. గతంలో కూడా ఇలా పడవలు కొట్టుకువచ్చిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విచారణలో పూర్తి విషయాలు తెలియనున్నాయి.