ఛైర్మన్ చేసింది అనైతికం : ప్రజలు ఆశీర్వదిస్తే..మరో 50 ఏళ్లు మేమే – బొత్స

  • Publish Date - January 23, 2020 / 08:36 AM IST

తాము చేసిన చట్టాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే..ప్రతిఫలం అనుభవిస్తాం..ప్రజలు అంగీకరిస్తే..మరో 50 ఏళ్లు తాము అధికారంలో ఉంటామన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంకా దోపిడి కొనసాగాలని బాబు కోరుకుంటున్నారని, కౌన్సిల్‌కు తాగి వచ్చారని ఆరోపణలు చేయడం సరికాదని ప్రతిపక్ష పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసిందేనని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా..కుట్రలు చేసినా..తమ విధానం మారదని మరోసారి స్పష్టం చేశారాయన.

2020, జనవరి 23వ తేదీ గురువారం ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై ఆయన  మీడియాతో మాట్లాడారు. ఛైర్మన్ వ్యవహరించిన తీరును పూర్తిగా తప్పుబట్టారు. 
ప్రజాతీర్పునకు అనుగుణంగా మండలి ఛైర్మన్ వ్యవహరించలేదన్నారు. మండలిలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్‌లో మండలి ఛైర్మన్ నడుచుకుంటున్నారని విమర్శించారు.

 

తాబేదారులను ఉన్నత పదవులను కూర్చబెడితే ఏమవుతుంది ? దీనికి సమాధానం చెప్పాలన్నారు. అంతేగాకుండా..మండలిలో జరిగిన పరిణామాలపై చర్చ జరగాలని సూచించారు. ఇన్ని కుతంత్రాలు ఎప్పుడూ చూడలేదన్నారు. అయితే..ఇక్కడ తమ ప్రభుత్వం మాత్రం..చట్టబద్ధంగా ముందుకెళుతామన్నారు. ఏ రకంగా రూల్‌కు అనుమతినిస్తారని ఛైర్మన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు ఏపీ మంత్రి బొత్స. 

 

* మండలిలో రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులకు బ్రేక్ వేసింది టిడిపి. 
* స్పీకర్ తన విచక్షణాధికారంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది. 
* ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 

 

* రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే
* సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరిపారు.
* న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 
* అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Read More : మండలి మంటలు : ఛైర్మన్ ఏమని అనుకుంటున్నావ్ ? పార్టీ ఆఫీసు అనుకుంటున్నావా ?