Indrakeeladri: దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు
విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై ఆదివారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం ఈవో వికె శీనా నాయక్ కీలక ప్రకటన చేశారు.
- V Santhosh Kumar
- Updated on- July 25, 2026 / 09:21 PM IST
Vijayawada kanaka durga temple shakambari utsavalu vip darshan cancelled
- శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లు
- కూరగాయలతో దుర్గమ్మ అలంకరణ
- విఐపి దర్శనాలు రద్దు
Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈనెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే శాకంబరీ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ పవిత్ర రోజుల్లో అమ్మవారు (Indrakeeladri)శాకంభరీ దేవిగా దర్శనమివ్వనుండటంతో, ప్రకృతి మాత రూపంలో అలంకరించేందుకు వివిధ జిల్లాల నుంచి సుమారు 7 టన్నుల కూరగాయలు, పండ్లను సేకరించారు. తెలంగాణ నుంచి బోనాలు, సారె సమర్పించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుండటంతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది.
Pralhad Joshi: రాష్ట్రపతి భవన్ కీలక ప్రకటన.. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు
భక్తుల రద్దీ వేళ కీలక నిర్ణయాలు.. విఐపి దర్శనాలు రద్దు:
ఆదివారం నాడు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం ఈవో వికె శీనా నాయక్ కీలక ప్రకటన చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విఐపి, ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేసి, సాధారణ భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డులో ప్రైవేట్ వాహనాలను నిషేధించి కేవలం దేవస్థానం బస్సులనే అనుమతిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లులు రద్దీ లేని వేళల్లోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
