×
Ad

Chiranjeevi : మరోసారి రాజ్యసభకు మెగాస్టార్‌ చిరంజీవి..?

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈసమయంలో మరోసారి వైసీపీ చిరంజీవికి ఎంపీ సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికంగా ఉన్న కాపు ఓట్లపై జనసేన, బీజేపీ ఫోకస్ పెట్టాయి.

  • Published On : January 14, 2022 / 11:27 AM IST

Chiranjeevi (1) 11zon

Chiranjeevi Rajya Sabha once again : కేంద్ర మాజీమంత్రి, సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళ్లబోతున్నారా…? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా చిరంజీవికి వైసీపీ ఎంపీ ఆఫర్‌ ఇచ్చినా అప్పట్లో ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు.

అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈ సమయంలో మరోసారి వైసీపీ చిరంజీవికి ఎంపీ సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో గణనీయమైన స్థాయిలో ఉన్న కాపు ఓట్లపై జనసేన, బీజేపీ దృష్టిపెట్టాయి. జనసేన కాపులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చసేస్తోంది. దీంతో చిరంజీవిని రాజ్యసభకు పంపి జనసేనకు చెక్‌పెట్టాలన్నది వైసీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది.

Surya Namaskaralu : కోటి మందితో సూర్య నమస్కారాలు

జూన్‌ 21తో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగూ వైసీపీ ఖాతాల్లోకే చేరతాయి. ఇందులో ఒకటి చిరంజీవికి ఇవ్వాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి దీనిపై చిరంజీవి ఏం చేస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. గతంలోలాగా ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తారా లేక అంగీకరించి మరోసారి పెద్దల సభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తిగా మారింది.