Payyavula Keshav : మీరు చెప్పిన లెక్క ప్రకారం పులివెందులలో జగన్ కు ఓటు ఉండటం నేరం : ఎమ్మెల్యే పయ్యావుల

జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని తెలిపారు. ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.

MLA Payyavula Keshav

Payyavula Keshav – Jagan : ఓట్ల తొలగింపుపై తాము చేస్తున్న పోరాటం ఫలించిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. 2022 నుంచి తొలగించిన ప్రతి ఓటుపై రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ చెప్పిందని, నిన్న(బుధవారం) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఇక బల్క్ గా ఓట్లు తొలగించే ప్రక్రియ ఉండదన్నారు. అలా ఇస్తే ఏఈఆర్ఓ నేరుగా వాటిని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.

ఇతర అభ్యంతరాలు ఏమైనా బల్క్ గా ఉంటే.. కొన్ని నిబంధనలు ఇచ్చారని పేర్కొన్నారు. ఏఈఆర్ఓ, బీఎల్ఓ, డిప్యూటీ తహసీల్దార్ ముగ్గరి కమిటీతో ఎంక్వైరీ చేయాలని వెల్లడించారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో ఓట్ల డెలిషన్ చేయమంటే అరెస్ట్ చేయాలన్న నిబంధన ఉందని గుర్తు చేశారు.  ఉరవకొండలో ఓట్ల తొలగింపులో ఇద్దరు సీఈఓల సస్పెన్షన్ ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని, అందరూ బయటకు వస్తారని పేర్కొన్నారు.

Mylavaram: మళ్లీ హీటెక్కిన మైలవరం రాజకీయం.. వైసీపీకి తప్పని తలనొప్పులు

ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులకు ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సాగిందన్నారు. అధికార పార్టీ చెప్పినట్టు ఇప్పటివరకు సాగింది ఇక అలా జరగదని స్పష్టం చేశారు. సస్పెన్షన్ కు గురవుతున్న అధికారులను ఎవరూ కాపాడలేరని తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ.. ఈసీని ఎవరూ ప్రభావితం చేయలేరని చెప్పారు.

జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని తెలిపారు. ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పులివెందులలో జగన్ ఓటు ఉండటం నేరమని పేర్కొన్నారు. అధికారులు జాగ్రత్తగా పని చేయాలని లేకపోతే అది వారి మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు.