Buddha Venkanna
TDP Leader Buddha Venkanna : సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. వైసీపీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కరకట్టపై అద్దెకు ఉన్న ఇళ్లు లింగమనేనిదని తెలిపారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ను పక్కదారి పట్టించేందుకు, ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించారని ఆరోపించారు. జగన్ కు తాడేపల్లిలో విల్లాస్ కట్టేవాళ్లు గిఫ్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.
చంద్రబాబు జగన్ లాగా పుట్టుకతో జమిందారు కాదన్నారు. జగన్ కు బెంగళూరు, విజయవాడ, వైజాగ్, హైద్రాబాద్ లో ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు విజయవాడలో అద్దెకు మాత్రమే ఉంటున్నారని తెలిపారు. సీఐడీ అంటే చెత్తబుట్ట మాదిరి తయారైందని మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని సంబర పడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, అవినాష్ రెడ్డి బయటపడడం అసాధ్యం అన్నారు.
Polavaram Project : పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి : విపక్ష నేతలు
‘మీకు లింగమనేనికి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి..చంద్రబాబును ఎందుకు లాగుతారు’ అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు లింగమనేనికి గిఫ్ట్ ఇచ్చి ఉంటే పేరు ఉంటుంది కదా అని అన్నారు. జగన్ ప్రస్టేషన్ లో ఉన్నాడని తెలిపారు. లోకేష్ పాదయాత్ర 100 రోజులవుతుందని జగన్ లో టెన్షన్ మొదలైందన్నారు. చంద్రబాబు ఉంటానంటే తనతో పాటు వందలాది మంది ఇళ్లు ఇస్తారని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ లోనే స్కెచ్ లు నడుస్తున్నాయని చెప్పారు. అధికారులు వారి మాట వినకుంటే ట్రాన్ఫర్లు చేస్తారని వెల్లడించారు. చంద్రబాబును జైలుకు పంపడం సజ్జల తండ్రి వలన కూడా కాదన్నారు.