సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్

  • Publish Date - August 20, 2020 / 03:03 PM IST

ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది.



పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, టెండర్ల ప్రక్రియ, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా నది వరద పరిస్థితిపై సీఎం జగన్ అధికారులతో చర్చించనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాటన్నింటిపై క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి, వాటికి సంబంధించి వివరాలు తెలుసుకుని ప్రభుత్వం వాదనలు గట్టిగా వినిపించేందుకు ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. వరద పరిస్థితిపై అధికారులతో చర్చించనున్నారు.



ప్రధానంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ఏవైతే అభ్యంతరాలు చేయనున్నారో దానికి సంబంధించి అన్ని వ్యవహారాల్లో గట్టిగా ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని కసరత్తులు చేసింది.

సీఎం జగన్ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించడం ద్వారా క్షేత్రస్థాయిలో అక్కడ జరిగే వ్యవహారాలను పరిశీలించి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా ప్రభుత్వం తరుపు నుంచి వాదనలు వినిపించనున్నారు. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.



వరద పరిస్థితులను సమీక్షించి అక్కడి వరద పరిస్థితులపై అధికారులో చర్చించనున్నారు. ముందస్తుగా వరదలు ఎక్కువై, ముంచెత్తే ప్రమాదం ఉందా అనే విషయాలను స్వయంగా తెలుసుకోనున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. వచ్చే ఇన్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది.. ఔటో ఫ్లో ఏవిధంగా ఉందన్న దానిపై ఆయన సమీక్ష చేయనున్నారు.

వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా గుర్తించి గోదావరి వరదలో ప్రాణం నష్టం జరుగకుండా ఏవైతే ముందస్తు చర్యలు తీసుకుందో అదే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఇది వరకే ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు, ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.