బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ సీట్లు కేటాయించిన పవన్

పొత్తులో భాగంగా ఏపీలో బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని తెలిపారు.ఈ మూడు చోట్లా తాము అభ్యర్థులను నిలబెట్టడం లేదని, బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లోమాయావతితో కలవడం తమకు చాలా ఆనందం కలిగించిందన్నారు.మాయావతిని ప్రధానిగా చూడాలని జనసేన కోరుకుంటుందని తెలిపారు.

తాను లక్నోవెళ్లినప్పుడు ఆమె చూపించిన ప్రేమ తనను కదిలించిందన్నారు.మాయావతి తనకు ఓ మాతృమూర్తిగా కనిపించిందని తెలిపారు.2008లోనే బీఎస్పీకి ఏపీ అధ్యక్షుడుగా ఉండాలని తనకు ఆహ్వానం అందింది, కానీ అప్పుడు కుదలేదన్నారు, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బీఎస్పీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు.