Pawan Kalyan
Pawan Kalyan : పొత్తు కుదుర్చడంలో ఆయనదే కీరోల్. ఇంకో పది, పదిహేనేళ్లు కలిసే ఉంటామని చెప్తున్నది కూడా ఆయనే. ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమి ఒకటిగానే ఉంటుందని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెప్తున్నారు. కూటమి లాంగ్ లీవ్ అంటూ పవన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. అయినా ఈసారి పిఠాపురం వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు అయితే సమ్‌థింగ్ స్పెషల్‌గా మారాయి. ఇంటా, బయటా అందరికీ ఓ సంకేతం పంపించేలా ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. నిజానికి కూటమి విషయంలో చంద్రబాబు కంటే ముందే పవన్ ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నారు. తాము కలిసే ఉంటామని.. ఇంకో 15ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సారి పవన్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను ఉద్దేశించే అన్న చర్చ జరుగుతోంది. జనసేనలో కొందరు నేతలు.. టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి ముందుకు సాగకపోవడంతో పాటు.. అలయన్స్‌కు భంగం కలిగించేలా బిహేవ్ చేస్తున్నారట. అక్కడక్కడ సమస్యలు ఉన్నాయని..వాటిని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందనేది పవన్ దృష్టికి వచ్చిందట. దీంతో సమయం సందర్భంగా చూసి మరీ.. పిఠాపురం వేదికగా.. అటు రాజకీయ ప్రత్యర్థులకు.. ఇటు సొంత పార్టీ జనసేన నేతలకు పవన్ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. చంద్రబాబుకు, తనకు మధ్య మంచి సయోధ్య ఉందని కూడా పవన్ స్పష్టం చేశారు. ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు, గ్యాప్‌లు లేవని చెప్పుకొచ్చారు పవన్.
వాళ్లను గట్టిగనే టార్గెట్ చేశారు..
సేమ్‌టైమ్ పిఠాపురంలో కొందరు చేస్తున్న కుట్రలు ఫలించవంటూ.. తమ రాజకీయ ప్రత్యర్థులను గట్టిగానే టార్గెట్ చేశారు పవన్. గత ప్రభుత్వం కేవలం బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని, ఇప్పుడు పిఠాపురంలో మళ్లీ అదే పద్ధతులను అమలు చేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు. పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు, కానీ పిఠాపురంలో చిన్న పిల్లల గొడవ పడితే దానికి కులమతాల రంగు పులిమి రచ్చ చేస్తారా అంటూ విమర్శించారు. పిఠాపురంలో అశాంతి సృష్టించాలని చూస్తే, ఇక్కడే కూర్చునే అరాచక శక్తులను ఏరివేస్తానంటూ గర్జించారు సేనాని. తనను మెత్తని మనిషిగా భావించి నెత్తికెక్కాలని చూడొద్దన్న పవన్.. గొడవ పెట్టుకోవాలంటే తాను కూడా సిద్ధమేనంటూ సవాల్ చేసి మరింత ఇంట్రెస్టింగ్ చర్చకు దారి తీశారు. కూటమిని వీక్ చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మరోసారి క్లారిటీ ఇచ్చిన పవన్ ..
ఏపీలో టీడీపీ, బీజేపీ.. కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కీరోల్ ప్లే చేశారనేది ఓపెన్ సీక్రెట్. ఈ విషయంపై పవన్ కూడా పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. అదే పవన్ కల్యాణ్ ఇప్పుడు కూటమి లాంగ్ లీవ్ అని పదేపదే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచే పవన్ ఈ స్లోగన్‌ను బలంగా వినిపిస్తున్నారు. చాలాకాలం పాటు కూటమి అధికారంలో కొనసాగాలని, అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తున్నారు. లేటెస్ట్‌గా పిఠాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా ఆయన ఇదే అంశాన్ని మరోసారి గుర్తు చేయడం ఆసక్తికరంగా మారింది.
పవన్ వార్నింగ్ సొంత పార్టీ నేతలకేనా?
రాజకీయ ప్రత్యర్థులు అధికార పక్షాన్ని బలహీనపర్చాలని కోరుకోవడం, ప్రయత్నించడం కామనే. ఈ క్రమంలో గతంలోనే వైసీపీకి తేల్చి చెప్పారు పవన్. మీరెన్ని ప్రయత్నాలు, కుట్రలు చేసినా కూటమిని విడదీయలేదరని గతంలోనే పలుసార్లు ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే ఈ సారి పవన్ వార్నింగ్‌లు మాత్రం బయటి వాళ్లకంటే..సొంత పార్టీ నేతలకే ఎక్కువ తాకుతున్నాయట. కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య పైస్థాయిలో సఖ్యత ఉన్నా, గ్రౌండ్ లెవెల్‌లో సమన్వయం లోపించిందన్న ప్రచారం ఉంది. అక్కడక్కడ లీడర్ల ఆధిపత్య పోరు, హవా చూపించాలన్న ప్రయత్నాలతో ఐక్యతకు ముప్పుగా మారొచ్చన్న ఆందోళన ఉంది. ఈ క్రమంలోనే కిందిస్థాయి కార్యకర్తలు, నేతలకు క్లియర్ కట్ ఇండికేషన్ పంపించేందుకే పవన్ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారంటున్నారు.